Relationship: భార్యభర్తల మధ్య గొడవలు కామన్ గా వస్తుంటాయి. కానీ ఈ గొడవలు మరింత పెంచేలా బిహేవ్ చేయకూడదు. కొందరు తర్వాత ఏం జరుగుతుందో ఆలోచించకుండా తొందరపడుతుంటారు. తర్వాత పరిమాణాలు తెలుసుకొని బాధ పడుతుంటారు. కానీ అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా, ఒక వాదన తలెత్తితే, గొడవ మరింత పెరిగే అవకాశం ఉందని ఇద్దరు కూడా గుర్తించాలి.. ఇదిలా ఉంటే కొన్ని విషయాల్లో మాత్రం భార్య తన భర్తతో కొన్ని విషయాలకు దూరంగా ఉండటమే బెటర్. ఇంతకీ అవేంటి అనుకుంటున్నారా?
ముఖ్యంగా గొడవల సందర్భంలో ఆచితూచి వ్యవహరించడం వల్ల మీ లైఫ్ బాగుంటుంది.. భార్య తన భర్తతో గొడవపడినప్పుడల్లా, అతను గతంలో చేసిన తప్పులను గుర్తు చేయకూడదు. ఎందుకంటే గతాన్ని తవ్వడం వల్ల సమస్య పరిష్కారం కాదు కదా.. గొడవ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. మీ లక్ష్యం పోరాటాన్ని ముగించడమే కానీ అగ్నికి మరింత ఆజ్యం పోయడం కాదని గుర్తు పెట్టుకోండి.
కొన్ని సార్లు కోపం ఎక్కువగా ఉండటం వల్ల సమస్యకు వెంటనే పరిష్కారం దొరకాలి అని.. అప్పుడే వాదిస్తూ ఉంటారు. కానీ దీని వల్ల సమస్య మరింత తీవ్రతరం చేస్తుంది. గొడవ శాంతించిన తర్వాత కోపంతో ఉన్న మీ భర్తను ఒప్పించే కూల్ చేసి మాట్లాడాలి. కొన్నిసార్లు సమయం ప్రతి గాయాన్ని నయం చేస్తుంది.. కాబట్టి అవగాహనతో ఈ వివాదం కూడా పరిష్కారమవుతుందని గ్రహించడం వల్ల మీ బంధం సంతోషంగా ఉంటుంది..
కొన్ని సార్లు గొడవను హర్ట్ ఫుల్ గా పరిష్కరించుకోవాలి కానీ నామ్ కే వాస్తే కాదు అని గుర్తు పెట్టుకోండి. చెప్పినట్టు వింటాను అన్నట్టు, లేదా చేసిన తప్పును మరొకసారి చేయను అని మనస్ఫూర్తిగా చెప్పాలి కానీ చేస్తాను అని నటించకూడదు. మీరు ప్రతిదీ సరిదిద్దాలని అనుకుంటున్నట్టు నటించవద్దు. నిజం ఎప్పటికి అయినా తెలిసి పోతుంది. మరో సారి ఇలాంటివి జరిగితే వారి దృష్టిలో మీరు చాలా చెడ్డ వారిగా నిలిచిపోతారు.
భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినప్పుడు ఒకరి బంధువులపై మరొకరు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం కామన్ గా జరుగుతుంటుంది. ఇద్దరు ఇలాంటి వాఖ్యలు చేయడం సరైనది కాదు. ఇక భార్య కూడా భర్త బంధువులను నిందించకూడదు. ఇదే కొనసాగితే.. భర్త మీ తల్లిదండ్రులను తిట్టడం.. మీరు వారి కుటుంబంపై పలు మాటలు అనడం కామన్ గా జరుగుతుంటుంది. ఇలా కంటిన్యూ అయితే ఇద్దరి మధ్య మీ, నా అనే బేధం పెరిగి మీ మధ్య చాలా దూరం పెరుగుతుంటుంది.
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Do you know how to be a wife to a husband
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com