Romance Benefits: ఆధునిక కాలంలో శృంగారానికి ఆసక్తి తగ్గిపోతోంది. పని ఒత్తిడి, వాతావరణం, జీవనశైలి తదితర కారణాలతో చాలా మంది శృంగారానికి దూరమైపోతున్నారు. కలయికకు మొగ్గు చూపడం లేదు. జీవిత భాగస్వామితో బంధం సరిగా లేని కారణంగా శృంగారం పట్ల శ్రద్ధ కానరావడం లేదు. వయసు పైబడటంతో శృంగారం ఇష్టపడటం లేదని చెబుతున్నారు. దీంతో రోగాల బారిన పడే సూచనలు కనిపిస్తున్నాయి. భాగస్వామితో బంధం బలంగా ఉండాలంటే శృంగారం తప్పనిసరి. భవిష్యత్ లో కూడా శృంగారం చేయకపోతే ఇబ్బందులు తప్పవు.

అమెరికాలో 2016లో జరిపిన ఓ అధ్యయనంలో తరచుగా శృంగారంలో పాల్గొనే వారిలో రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇమ్యునోగ్లోబులిన్ ఎ యాంటీ బాడీని విడుదల చేసినట్లు చెబుతున్నారు. గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. రక్తప్రసరణను బాగు చేస్తుంది. శృంగారం వల్ల ముఖ్యమైన హార్మోన్లు విడుదలవుతాయి. ఎండార్ఫిన్, ఆక్సిటోనిన్ లు మంచి నిద్ర వచ్చేలా చేస్తాయి. ఆందోళన, నిరాశను తగ్గిస్తుంది. శృంగారంతో ఇన్ని లాభాలు ఉండటంతో ఒత్తిడి, ఆందోళన దూరమవుతాయి.
శృంగారం లేకపోతే శారీరక, మానసికంగా కల్లోలం కలుగుతుంది. శృంగారం దూరమైతే మెదడు సరిగా పనిచేయదు. ఒకరిపై మరొకరికి విశ్వాసం పెరగాలంటే శృంగారమే ప్రధానంగా నిలుస్తోంది. మెనోపాజ్ తరువాత ఈస్ట్రోజన్ ను శరీరం ఎక్కువగా ఉత్పత్తి చేసినప్పుడు యోని గోడలు కుంచించుకుపోతాయి. యోని కణజాలం సన్నబడుతుంది. దీంతో అసౌకర్యంగా అనిపించవచ్చు. వారానికి కనీసం ఒకటి రెండు సార్లు శృంగారంలో పాల్గొనడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కలయికకు దూరంగా ఉండే వారిలో ఇన్ఫెక్షన్ల ముప్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మహిళలు సంభోగంలో పాల్గొన్న సమయంలో భావప్రాప్తి కలగొచ్చు. సుదీర్ఘ విరామం తరువాత శృంగారం చేయడం వలన ఇతర సమస్యలతో పాటు ఉద్వేగాలు పెరుగుతాయి. అందుకే అప్పుడప్పుడు శృంగారంలో పాల్గొంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎంతో హాయిగా అనిపిస్తుంది. మహిళలు, పురుషులు ఇద్దరికి కూడా శృంగారమే పరమ ఔషధంగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో శృంగారం మంచి కార్యంగా భావించుకుని వారానికి కనీసం రెండు మూడు సార్లయినా పాల్గొంటేనే ప్రశాంతత లభిస్తుంది.