
Betel Leaf Benefits: హిందూ మతంలో తమలపాకుకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుంటాం. దేవుడికి సమర్పించడంలో దీన్ని వాడతాం. ఆంజనేయుడికి తమలపాకు అంటే చాలా ఇష్టం. అందుకే ఆయనకు మంగళ, శనివారాలు తమలపాకుల దండ వేసి భక్తితో కొలుస్తుంటారు. ఇంకా అన్నం త్వరగా జీర్ణం కావాలంటే తాంబూలం వేసుకుంటారు. ఇలా దీని వినియోగం చాలానే ఉంది. ఎన్నో అనారోగ్య సమస్యలు దూరం చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. పూర్వకాలంలో భార్యాభర్తలు ఏకాంతంగా తాంబూలాలు చుట్టుకుని నోట్లో వేసుకునే వారు. రానురాను ఆ సంప్రదాయం పాటించడం లేదు. కానీ తమలపాకు విశిష్టత తెలిస్తే దాన్ని వినియోగించకుండా ఉండలేం. అంతటి విలువ దానికి ఉందనే విషయం చాలా మందికి తెలియదు.
తాంబూలంగా..
కొందరికి ఇప్పటికి కూడా భోజనం తరువాత తాంబూలం వేసుకోవడం అలవాటుగా ఉంటుంది. తిన్న ఆహారం తొందరగా జీర్ణం అయ్యేందుకు ఇది దోహదపడుతుంది. ఇందులో విటమిన్ సి, థయామిన్, నియాసిన్, రైబోప్లానిన్, కెరోటిన్, కాల్షియం వంటి పోషకాలు లభిస్తాయి. తమలపాకులో ఇంకా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. చాలా మందికి పాన్ తినడం అలవాటే. పాన్ లో తమలపాకే ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆకు, వక్క, సున్నం కలిపితేనే పాన్ తయారవుతుంది. దీన్ని నోట్లో వేసుకుని నములుతుంటారు. దీంతో నోరు శుభ్రంగా అవుతుందని చెబుతారు.
ఆయుర్వేదంలో..
ఆయుర్వేదంలో కూడా తమలపాకుకు ఎంతో విలువ ఉంది. ఇందులో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. మన పూర్వీకులు తమలపాకుతో ఎన్ని చిట్కాలు ఉపయోగించి మన రోగాలను నయం చేశారు. డయాబెటిస్ ను దూరం చేసే గుణాలు ఇందులో ఉన్నాయి. ఈ ఆకుల్లో అయోడిన్, పొటాషియం విటమిన్ ఎ, విటమిన్ బి1, విటమిన్ బి2, నికోటిన్ వంటి యాసిడ్లు లభిస్తాయి. మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణం కావాలంటే పాన్ వేసుకోవడం చేస్తుంటారు. శరీరంలో మెటబాలిజంను పెంచుతుంది. రోగనిరోధక శక్తి పెరిగేందుకు దోహదపడుతుంది.

కొవ్వును కరిగించడంలో..
శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగించడంలో సాయపడుతుంది. అధిక బరువు సమస్యకు కూడా చెక్ పెడుతుంది. శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రణలో ఉంచేందుకు తోడ్పడుతుంది. ఇలా తమలపాకు మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అందుకే మన పూర్వీకులు దీన్ని వాడుకుని పలు రకాల సమస్యలను దూరం చేసుకున్నారు. మనం కూడా వీటిని ఉపయోగించుకుని మన అనారోగ్య సమస్యలకు తగిన పరిష్కారం కనుగొనవచ్చు. దీని వాడకాన్ని తెలుసుకుని మన ఆరోగ్య పరిరక్షణలో విరివిగా వాడుకుని ప్రయోజనం పొందాల్సిన అవసరం ఉంది.