Phones: జీవితంలో ఫోన్ ఒక భాగమైపోయింది. అసలు ఫోన్ లేకపోతే ఏమి తోచకుండా పోతోంది. సగటును ఫోన్ల వినియోగం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. దీంతో వినియోగదారుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ వాడకం అంతకంతకూ ఎక్కువైపోతోంది. రానురాను రాజుగారి గుర్రం గాడిదయిందన్నట్లుగా ఫోన్ల వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ప్రపంచంలో 529 కోట్ల మంది అంటే జనాభాలో 65 శాతానికి సమానంగా ఫోన్లు వినియోగిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి.

కరోనా పుణ్యమాని సెల్ ఫోన్ల వినియోగం మరీ పెరిగింది. సామాజిక మాధ్యమాలకు అందరు అతుక్కుపోతున్నారు. ఫేస్ బుక్, ట్విటర్, వాట్సాప్ తదితర వాటితో నిత్యం కాలం గడుపుతున్నారు. తెల్లవారి లేచింది మొదలు కొందరైతే కాలకృత్యాలు సైతం తీర్చుకోకుండా ఫోన్లు ఉపయోగించడం విశేషం. దీంతో మొబైళ్ల వాడకంపై నిపుణులు హెచ్చరిస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. ఫలితంగా వినియోగదారులు తగ్గాల్సి ఉన్నా ఇంకా పెరుగుతూనే ఉన్నారు.
వి ఆర్ సోషల్ అనే రీసెర్చ్ సంస్థ ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో విస్తుగొలిపే అంశాలు వెలుగు చూశాయి. డిజిటల్ 2021 అక్టోబర్ గ్లోబల్ స్నాప్ చాట్ పేరుతో చేసిన సర్వేలో 5.29 బిలియన్ల మంది మొబైల్ ఫోన్లు వాడుతున్నారని తెలిపింది. దీంతో ఫోన్ల వినియోగంపై అందరిలో ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. ప్రంపచ జనాభాలో మూడింట రెండో వంతు ఫోన్లు వాడుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: Hair Care Tips: ప్రెగ్నెన్సీ తర్వాత జుట్టు రాలిపోతుందా..? పాటించాల్సిన చిట్కాలు ఇవే!
ప్రపంచవ్యాప్తంగా 455 కోట్ల మంది సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్నట్లు సమాచారం. ప్రతి రోజు దాదాపు 40 లక్షల మంది సామాజిక మాధ్యమాల్లో చేరుతున్నట్లు వెల్లడించింది. దీంతో మొబైల్ వాడకం ఎంతగా పెరిగిందో ఇట్టే అర్థమైపోతోంది. 2022 నాటికి ప్రపంచ జనాభాలో 60 శాతం పైగా ప్రజలు మొబైల్ వినియోగించే అవకాశం ఉందని చెబుతున్నారు.
Also Read: Water: నిలబడి నీళ్లు తాగేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఆ సమస్యలు వచ్చే ఛాన్స్!