https://oktelugu.com/

Horse Puzzle: ఈ ఫొటోలో ఎన్ని గుర్రాలు ఉన్నాయో తెలుసా.. మీరు ఖచ్చితంగా గుర్తించలేరు!

Horse Puzzle: ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాల్లోనే వినోదంతో పాటు మెదడుకు పదును పెట్టే పజిల్స్​ కూడా బాగా ఫేమస్​ అవుతున్నాయి. ఇదిగో ఈ ఫొటోలో ఎన్ని నంబర్స్ ఉన్నాయో గుర్తించండి.. ఇన్ని సెంకన్లలో ఈ పిక్చర్​లో ఉన్న లోపం కనిపెడితే మీరే ఇవాల్టి జీనియస్​ అంటూ నెట్టింట్లో కొన్ని పజిల్స్​ ఫొటోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ ఫొటో అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. అందులో ఏముందో చాలా జాగ్రత్తగా చూస్తే తప్ప గుర్తించడం కష్టం.. అంత కఠినంగా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 27, 2021 / 10:07 AM IST
    Follow us on

    Horse Puzzle: ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాల్లోనే వినోదంతో పాటు మెదడుకు పదును పెట్టే పజిల్స్​ కూడా బాగా ఫేమస్​ అవుతున్నాయి. ఇదిగో ఈ ఫొటోలో ఎన్ని నంబర్స్ ఉన్నాయో గుర్తించండి.. ఇన్ని సెంకన్లలో ఈ పిక్చర్​లో ఉన్న లోపం కనిపెడితే మీరే ఇవాల్టి జీనియస్​ అంటూ నెట్టింట్లో కొన్ని పజిల్స్​ ఫొటోలు వైరల్ అవుతుంటాయి.

    తాజాగా, ఓ ఫొటో అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. అందులో ఏముందో చాలా జాగ్రత్తగా చూస్తే తప్ప గుర్తించడం కష్టం.. అంత కఠినంగా ఉంది పజిల్​. అందులో ఆప్టికల్​ ఇల్యూజన్ ఫొటో అయితే, ఇక తల పట్టుకోవాల్సిందే. ప్రస్తుతం అలాంటి పజిల్స్​ యే నెట్టింట్లో ట్రెండింగ్​మా మారాయి. తాజాగా, అలాంటి ఫొటో ఒకటి పజిల్​ ఆఫ్​ది పిక్చర్​గా మారింది.

    ఈ ఫొటోలో గుర్రాలతో పాటు మంచు పర్వతాలు కూడా ఉన్నాయి అయితే, వాటిని మింగిల్ చేస్తూ.. ఓ ఇల్యూజన్​ను సృష్టించారు. ఎంతో తీక్షణంగా పరిశీలిస్తే తప్ప.. అందులో కచ్చితంగా ఎన్ని గుర్రాలు ఉన్నాయో చెప్పడం కష్టం. ఈ పజిల్ చూడగానే, ఏముందిలే?.. చాలా సింపుల్​ అనిపిస్తుంది. కానీ, ఒక్కసారి గేమ్ మొదలుపెడితే.. మీ బ్రెయిన్​ అబ్బా అనడం ఖాయం. ఇప్పటి వరకు చాలా మంది వీక్షకులు ఇందులో 5 గుర్రాలకు మించి ఎక్కువగా గుర్తించలేక పోయారు. నిజానికి ఇందులో 7 గుర్రాలున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఈ ఫొటోపై ఓ లుక్కేసి.. అందులో గుర్రాలను కనిపెట్టి.. మీరేంటో నిరుపించుకోండి.