Shani Shanti Mantra: మనకు గ్రహాలు అనుకూలంగా లేకపోతే ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అనారోగ్య సమస్యలు దాపురిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. దేవుడి శాంతి మంత్రం చదివితే ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు రాకుండా చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ జబ్బులతో బాధపడే వారు ఈ మంత్రాన్ని చదువుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఏలిననాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, శని మహర్దశ అని వివిధ దశలుంటాయి. నొప్పులు ఉన్నప్పుడు నడుము నుంచి పాదాల దాకా నువ్వుల నూనె రాసుకుని శని ఉపశమన మంత్రం జపిస్తే మంచి లాభం కలుగుతుంది.
నువ్వుల నూనె
శరీరానికి నూనె పట్టించి రెండు గంటల తరువాత వేడి నీళ్లతో స్నానం చేస్తే నొప్పులు తగ్గుతాయి. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గేందుకు ఆస్కారం ఉంటుంది. నువ్వుల నూనె మర్దన చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. వృద్ధాప్య చాయలు కనిపించవు. ఎముకలు దృఢంగా మారడానికి అవకాశం ఉంటుంది. కొందరికి శని ప్రభావంతో బద్ధకం పెరుగుతుంది. ఈ మంత్రం జపిస్తే అన్ని బాధలు దూరం కావడానికి అవకాశం ఉంటుంది.
శని శాంతి మంత్రం ఇదే..
శనైశ్చరో మహాభాగో! సర్వారిష్ట నివారక! కాకధ్వజో రుద్రరూపో! కలికల్మషనాశక!!
ధీరో గంభీరో! ధృడ సంకల్ప కారక !
దేవదేవో దుర్నిరీక్షో ! దేవాసురవందిత !!
కరాళో కంటకో క్షుద్ధో ! కష్టనష్టకారక !
పవిత్రో ప్రలోభో ! ప్రారద్ధకర్మ ఫలప్రద !!
నిర్గుణో నిత్యతృత్పో ! నిజతేజ ప్రకాశిత !
నిరుపమో మహావీరో ! మదమాత్సర్య నాశక: ! ప్రసన్నో ప్రమోదో ! శరణాగత వత్సల !!
శనైశ్చర పంచకమిదం య: పఠేతృతం నర:
సర్వకష్ట వినిర్ముక్షో శ్రీ వనైశ్చర కరుణం లభేత్ !!
ఆపదలు రాకుండా..
ఇలా శని శాంతి మంత్రం జపించడం వల్ల మనకు కష్టాలు దూరమవుతాయి. ఆపదలు రాకుండా ఉంటాయి. శని దేవుడి చూపు వల్ల మనకు మంచి ఫలితాలు వస్తాయి. శనిని అందరు కీడు చేసే వాడుగా భావిస్తారు. కానీ శని వల్ల కూడా మనకు శుభాలు కలుగుతాయనే విషయం చాలా మందికి తెలియదు. అందుకే శని శాంతి మంత్రం ఎప్పుడు చదువుకుని కష్టాల నుంచి విముక్తులం కావాల్సిన అవసరం ఉంది.