Hibiscus Flower Benefits: జుట్టు అందంగా ఉండాలని అందరు ఆశిస్తుంటారు. దీని కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఎన్నెన్నో చిట్కాలు పాటిస్తుంటారు. ఆయుర్వేదంలో జుట్టు ఒత్తుగా పెరగాలంటే రాలిపోకుండా ఉండాలంటే మందార పువ్వు ప్రధాన పాత్ర పోషిస్తుందనే విషయం చాలా మందికి తెలియదు. మందార పూలు, ఆకులు, పువ్వులు కూడా మనకు చాలా రకాల ప్రయోజనాలు కలిగి ఉంటాయి. చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. ఈ నేపథ్యంలో మందార పూలు జుట్టు కోసం మందులా ఉపయోగపడతాయి.

ఇటీవల కాలంలో చిన్న వయసులోనే బట్టతల వస్తుంది. దీంతో నలుగురిలో తిరగడానికి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మందార పువ్వును ఉపయోగించుకుని జుట్టుకు మేలు కలిగించే లాభాలు సాధించుకోవచ్చు. మందార పువ్వుతో ఐదు సులభమైన మార్గాల్లో జుట్టు సంరక్షణకు తీసుకోవాల్సిన చిట్కాలను తెలుసుకుందాం. ఇంట్లోనే వీటిని తయారు చేసుకుని వాటితో మన జుట్టును సమృద్ధిగా పెంచుకోవడానికి కొన్ని పద్ధతులు పాటించుకోవచ్చు. మందార నూనెతో మసాజ్ చేయించుకుంటే ఆరోగ్యకరమైన జుట్టు కలిగేందుకు దోహదపడుతుంది.
మందార పూల నూనెను వారానికి రెండుసార్లు జుట్టుకు మసాజ్ చేసుకుంటే జుట్టు ఒత్తుగా మారుతుంది. పది మందార పూలు, పది మందార ఆకులను తీసుకుని గ్రైండ్ చేసుకుని వేడి చేసి ఒక కప్పు కొబ్బరినూనె లేదా ఆలివ్ ఆయిల్ పోసి వేడి చేసి రుబ్బి పేస్టుగా చేసుకోండి. ఈ మిశ్రమాన్ని 2 నుంచి 3 నిమిషాల పాటు కదిలించండి. ఇప్పుడు ఆ నూనెను తలకు పట్టించి అరగంట తరువాత షాంపూతో కడగాలి. మిగిలిన నూనెను తదుపరి ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.
మందారలో ఫోమింగ్ లక్షణాలు ఉన్నందున షాంపూలలో కూడా ఉపయోగిస్తుంటారు. మందార పువ్వు, ఆకులను 1:3 నిష్పత్తిలో తీసుకుని 5 పువ్వులకు 15 ఆకులు తీసుకుని అందులో నీళ్లు పోసి అందులో మందార పువ్వులు, ఆకులు వేసి ఐదు నిమిషాలు మరిగించి తరువాత మిశ్రమాన్ని రుబ్బుకోవాలి. పిదప దీన్ని తలకు బాగా పట్టంచి షాంపులాగా ఉపయోగించుకోవాలి. ఇంట్లో తయారు చేసిన మిశ్రమాన్ని రసాయన రహిత మందార షాంపూలా వాడుకోవచ్చు.

ఉసిరికాయ పొడి జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. మందార పొడి మరియు ఉసిరికాయ పొడిని సమాన పరిమాణంలో తీసుకుని ఎరుపు కుంకుమ పువ్వు పొడి అన్ని బ్యూటీ స్టోర్లలో దొరుకుతుంది. రెండు పొడులను కలుపుకుని నీరు పోసి పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు మరియు తలపై రుద్దండి. 30 నుంచి 40 నిమిషాల తరువాత షాంపూ ఉపయోగించి తలను కడుక్కోవాలి.
ఐదు మందార పువ్వులు, ఆకులను కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. దీన్ని తలపై రాసుకుని 2 నుంచి 3 గంటల పాటు అలాగే ఉంచుకోవాలి. తరువాత మందార షాంపూ ఉపయోగించి జుట్టును కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల జుట్టు తిరిగి పెరడం జరుగుతుంది. మందార పూల రేకులను పిండి కొబ్బరి పాలలో కలిపి కలబంధ గుజ్జు, తేనె, పెరుగును కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. దాన్ని తలకు పట్టంచి 25 నుంచి 30 నిమిషాల పాటు ఉంచుకుని కడిగితే మంచి ఫలితం ఉంటుంది.