Cloves Benefits: మసాలా దినులలో లవంగం ముఖ్యమైనది. మన అదృష్టాన్ని మార్చడంలో కూడా లవంగం ప్రధాన భూమిక పోషిస్తుంది. మన దేశంలో ఎంత కష్టపడినా అదృష్టం కలిసి రాకపోతే అంతే సంగతి. జీవితంలో పైకి ఎదగాలనే ఆశ అందరికి ఉంటుంది. అనుకున్నది సాధించాలంటే అదృష్టం కూడా కలిసి రావాలి. అందుకు లవంగం తోడ్పడుతుందని నమ్ముతుంటారు. వంటగదిలో లభించే లవంగంతో మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని గ్రహించుకోవాలి. మసాలా దినుసుగా ఉండే లవంగంలో ఇన్ని లాభాలున్నాయా అనే సందేహాలు అందరికి రావడం సహజమే.

లవంగాన్ని హిందీలో లాంగ్ అని పిలుస్తారు. భారతీయ వంటల్లో అద్భుతమైన మసాలా లవంగం. ఆరోగ్య ప్రయోజనాల కోసం, మందులు, దంత, జుట్టు సంరక్షణ ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు. అదృష్టాన్ని ఎలా పెంచుతుందో, ఆర్థిక ప్రయోజనాలు ఎలా తీసుకొస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. హిందూ ధర్మం ప్రకారం మన సంప్రదాయాల్లో, పండుగల్లో, ఆచారాల్లో ఉపయోగించడం కామనే. మసాలాలను ఉపయోగించడం వల్ల చెడు, కన్ను దిష్టి రాకుండా చేస్తుంది. దుర్గాదేవికి నవరాత్రుల్లో జత లవంగాలు నైవేద్యంగా పెడితే జీవితంలో విజయాలు లభిస్తాయని విశ్వాసం. మసాలాగా ఉపయోగించడంతో సానుకూల శక్తి వస్తుంది.
ఏదైనా ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలను చేసుకునేటప్పుడు లవంగాన్ని నమలడం శ్రేయస్కరంగా భావిస్తారు. లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఎర్ర గులాబీలు, రెండు లవంగాలను నైవేద్యంగా సమర్పించడంతో అదృష్టం వరిస్తుంది. డబ్బును ఆకర్షించవచ్చని చెబుతున్నారు. ప్రతిరోజు వినియోగించడం సాధ్యం కాకపోతే ప్రతి శుక్రవారం ఇలా చేసి రక్షణ పొందవచ్చు. ఏదైనా పనిమీద బయటకు వెళ్లే ముందు నోట్లో రెండు లవంగాలు ఉంచుకుంటే అడ్డంకులు తొలగిపోతాయని విశ్వాసం.

చెడు దృష్టి నుంచి రక్షించుకునేందుకు కూడా లవంగం ప్రధానంగా పనిచేస్తుంది. శనివారాలలో నూనె దీపంలో మూడు, నాలుగు లవంగాలు వెలిగించి ఇంట్లోని మూలల్లో ఉంచడం ద్వారా కన్ను దిష్టి తగ్గుతుంది. దీన్ని ప్రతి వారు ఉపయోగించుకుని లబ్ధి పొందవచ్చు. లవంగాలతో ఇన్ని లాభాలు ఉండటంతో వీటిని వినియోగించుకుని చెడును దూరం చేసుకోవచ్చు. లవంగాలను కూరల్లో వేసుకుంటే కూడా ఘాటు ఎక్కువగా ఉంటుంది. కూరలు కూడా మంచి రుచిగా మారుతాయి. అందుకే వాటిని వాడుకోవడం ఉత్తమం.