Chickpeas And Badam Benefits: మన ఆహార అలవాట్లు మారుతున్నాయి. దైనందిన జీవితంలో మనం ఎన్నో పొరపాట్లు చేస్తున్నాం. దానికి ప్రతిఫలం కూడా అనుభవిస్తున్నాం. అయినా మన బుద్ధి మారడం లేదు. మంచి ఆహారాల వైపు చూడటం లేదు. బేకరీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఫిజాలు, బర్గర్లు వంటి వాటినే తింటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. పాతికేళ్లకే జబ్బుల బారిన పడుతున్నాం. దీంతో జీవితమంతా మందులు మింగుతూ కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి ఎవరు కూడా జాగ్రత్తలు తీసుకోవడం లేదు.

పాతికేళ్లకే జబ్బులన్ని చట్టుముడుతున్నాయి. నూరేళ్లు హాయిగా జీవించాల్సిన శరీరం అనవసరంగా రోగాల బారిన పడుతోంది. దీనికి కారణం మనం తీసుకునే ఆహారాలే కావడం గమనార్హం. ఉప్పు, నూనె, కారం దట్టంగా దట్టించి తింటూ జబ్బులకు కేంద్రంగా మారుతున్నాం. ఉప్పులేని ఆహారం తీసుకోవాలని చెబుతున్నా పెడచెవిన పెడుతున్నాం. చక్కెర వాడొద్దంటే వినడం లేదు. డబ్బాలకు డబ్బాలు నూనె వాడుతున్నాం. దీంతో మన ఆరోగ్యం క్రమంగా దెబ్బ తింటోంది. ప్రకృతి సిద్ధంగా దొరికే వాటిని తింటే ఎలాంటి అనర్థాలు ఉండవు. ఏ జంతువు కూడా ఉడికించిన ఆహారం తీసుకోదు. ఒక్క మనిషి రుచి కోసం ఉడకబెట్టిన వాటిని తింటున్నాడు. దీంతో జబ్బులు తెచ్చుకుంటున్నాడు.
ఇరవైలోనే అరవైలా మారుతున్నారు. జబ్బులు దరి చేరడంతో మాత్రలతో కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి దాపురిస్తోంది. మన దేహం బలంగా ఉండాలంటే ధాన్యాలే కరెక్టు. శనగలు, వేరుశనగలు, ఉలవలు, అలసందలు, బబ్బర్లు వంటి వాటిని మనం ఆహారంగా తీసుకుంటే ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయనడంలో అతిశయోక్తి లేదు. రోజు గుప్పెడు శనగలు, అయిదు బాదం పప్పులు రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం వాటిని తీసుకుంటే ఎన్నో రకాల వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చు. కానీ ఎందరు ఇలాంటివి పాటిస్తారు. అందరికి తెల్లవారిందంటే ముక్క, చుక్క కావాలి. మందు తాగాలి. మాంసం తినాలి. అప్పుడే వారికి జిహ్వ చాపల్యం తీరుతుంది.

శనగలు, బాదం పప్పులను తీసుకోవడం వల్ల శరీరం ముడతలు పడదు. రోగాలు దరిచేరకుండా చేస్తాయి. మన రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడేలా దోహదం చేస్తాయి. సరైన ఆహారం తీసుకోకపోవడంతో చాలా మంది సన్నగా ఉంటారు. శనగలు, బాదంలు తీసుకుంటే శరీరం పుష్టిగా మారుతుంది. నీరసం ఆవహించదు. రక్తహీనత సమస్య కూడా రాదు. దీంతో మనం రోజువారీ ఆహారంలో శనగలు, బాదంలు చేర్చుకోవడం ఉత్తమమే. దీంతో మన శరీరం గుల్లబారకుండా మంచి ఆరోగ్యంతో ఉంటుంది. దీనికి అందరు కాస్త మనసుపెట్టి వాటిని తీసుకుంటే సరిపోతుంది. మంచి ఆహారాలను తీసుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.