spot_img
Homeఎంటర్టైన్మెంట్Khiladi Movie: మాస్ మహారాజా "ఖిలాడి" రిలీజ్ ఎప్పుడంటే?

Khiladi Movie: మాస్ మహారాజా “ఖిలాడి” రిలీజ్ ఎప్పుడంటే?

Khiladi Movie: మాస్ రాజా రవితేజ వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రేసుగుర్రంల దూసుకుపోతున్నారు మాస్ రాజా. దర్శకుడు రమేష్ వర్మ రవితేజ కాంబోలో రాబోతోన్న చిత్రం “ఖిలాడి”. మాస్ రాజా సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను కోనేరు సత్య నారాయణ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్య‌క్ర‌మాలు హుటాహుటిగా జ‌రుగుతున్నాయి.

ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో ఆర్ట్ డైరెక్టర్ గాంధీ నడికుడికర్ వేసి భారీ సెట్‌లో ఈ రోజు నుండి రవితేజ, మీనాక్షి చౌదరిలపై పాటను చిత్రీకరించనున్నారు.ఈ పాటను శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. అలానే ఈ చిత్రంలో మరొక పాటకు సంబంధించిన షూటింగ్ పార్ట్ మాత్రమే ఉందని సమాచారం.

ఈ డిసెంబర్ చివరి కల్లా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని అనుకున్నట్లుగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న థియేటర్ లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది.ఈ సినిమాకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ రెండు భిన్న పాత్రలను అభిమానులను అలరించేందుకు ముస్తాబు అయ్యారు.
రామారావు ఆన్ డ్యూటీ, అలాగే త్రినాద్ నక్కిన దర్శకత్వంలో ధమాకా సినిమా టైగర్ నాగేశ్వరరావు సినిమాలు చేస్తున్నారు మాస్ రాజా. వచ్చే ఏడాది వరుస సినిమాలతో అభిమానులతో సినిమా సందడి చేయనున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి ఎప్పుడు? ఆరోజు ఏం చేయొద్దు.. ఏం చేయాలంటే.

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాదిలో వచ్చే ఏకాదశి తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలలో శుక్ల, కృష్ణ పక్షాల్లో ఒక్కో ఏకాదశి చొప్పున ఏడాదిలో మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version