https://oktelugu.com/

Chanakya Niti: ఈ అలవాట్లు మీకు ఉన్నాయా.. చాణక్య నీతి ప్రకారం పేదరికంతో బాధ పడాల్సిందే?

Chanakya Niti: ఆచార్య చాణక్య మనిషి జీవితంలో సంతోషంగా జీవనం సాగించడానికి ఎన్నో విషయాలను వివరించిన సంగతి తెలిసిందే. కొన్ని విషయాల గురించి మనం అవగాహనను కలిగి ఉండటం ద్వారా జీవితంలో ఇబ్బందులు పడే అవకాశాలు అయితే ఉండదని చెప్పవచ్చు. కొన్ని అలవాట్లు ఉండటం వల్ల మన జీవితానికి ఎంత మేలు జరుగుతుందో కొన్ని అలవాట్లు ఉండటం వల్ల మన జీవితానికి చెడు జరుగుతుంది. మనిషి సంతోషంగా జీవించాలంటే డబ్బు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరానికి […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 17, 2022 / 11:26 AM IST
    Follow us on

    Chanakya Niti: ఆచార్య చాణక్య మనిషి జీవితంలో సంతోషంగా జీవనం సాగించడానికి ఎన్నో విషయాలను వివరించిన సంగతి తెలిసిందే. కొన్ని విషయాల గురించి మనం అవగాహనను కలిగి ఉండటం ద్వారా జీవితంలో ఇబ్బందులు పడే అవకాశాలు అయితే ఉండదని చెప్పవచ్చు. కొన్ని అలవాట్లు ఉండటం వల్ల మన జీవితానికి ఎంత మేలు జరుగుతుందో కొన్ని అలవాట్లు ఉండటం వల్ల మన జీవితానికి చెడు జరుగుతుంది.

    Chanakya Niti

    మనిషి సంతోషంగా జీవించాలంటే డబ్బు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరానికి మించి డబ్బులను ఖర్చు చేయడం వల్ల ఇబ్బందులు పడక తప్పదు. డబ్బును ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎక్కువ మొత్తం పొందేలా జాగ్రత్త పడాలి. సంక్షేమ పనులకు, శుభకార్యాలకు డబ్బును వినియోగిస్తే మేలు జరుగుతుందని చెప్పవచ్చు. దేవుని దయ వల్ల సంపద వచ్చినా ఆ సంపదను వృథా ఖర్చుల కోసం వినియోగించకూడదు.

    Also Read: ఎన్టీఆర్ ఇమేజ్‌ను వాడుకునే ప‌నిలో జ‌గ‌న్‌.. పెద్ద ప్లానే వేశారే..!

    మన స్నేహితులు మంచి వాళ్లు అయితే మనం డబ్బు విషయంలో మరింత ఎదిగే అవకాశాలు అయితే ఉంటాయి. మన స్నేహితులు చెడ్డవాళ్లు అయితే మాత్రం ఆర్థిక ఇబ్బందులు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. చెడు అలవాట్లు ఉన్నవాళ్లతో స్నేహం వల్ల ఎన్నో ఇబ్బందుల బారిన పడే అవకాశాలు అయితే ఉంటాయి. మనకు కూడా చెడు అలవాట్లు ఉంటే కెరీర్ పరంగా వచ్చే మంచి అవకాశాలు కూడా దూరమవుతాయి.

    డబ్బు విషయంలో ఇతరులకు అబద్ధాలు చెప్పి మోసం చేసే గుణాన్ని కలిగి ఉండకూడదు. ఈ గుణం వల్ల మరింత నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. వృద్ధులు, పేదలను అవమానించినా పేదరికంతో బాధ పడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుందని చెప్పవచ్చు. మోసం చేసి డబ్బు సంపాదించినా భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. డబ్బు విషయంలో ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.

    Also Read: స‌వాళ్లు విసిరిన వ్య‌వ‌స్థ‌ల‌ను గుప్పిట్లో పెట్టుకుంటున్న జ‌గ‌న్‌.. మిగిలింది అదొక్క‌టే..!

    ఇద్దరు హీరోలు ఎవరయ్యా మోహన్‌ బాబు ?
    ఆ మాజీ హీరోయిన్ కి మళ్ళీ ఛాన్స్ ఇస్తోన్న బోయపాటి !

    Tags