Home : ప్రస్తుత కాలంలో పిల్లలు చిచ్చరపిడుగుల్లా తయారవుతున్నారు.చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆందోళన చెందుతూ ఉంటారు. ఈ క్రమంలో వారు సక్రమమైన దారిలో నడిచేలా ప్రయత్నిస్తుంటారు. అయితే ఎంత ప్రయత్నించినా ఒక్కోసారి వారు సమాజంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మారిపోతూ ఉంటారు. ఈ తరుణంలో ఒక్కోసారి తప్పుడు పనులు కూడా చేస్తుంటారు. అయితే ఆ తప్పుడు పనులను గుర్తించిన తల్లిదండ్రులు వారిని కోప్పడుతూ లేదా వారిపై అరుస్తూ ఉంటారు. ఇవే కాకుండా మరికొన్ని పద్ధతుల ద్వారా వారిని నిత్యం వారిస్తూ ఉంటారు. ముఖ్యంగా టీనేజ్ వయసులో ఉన్నవారు తల్లిదండ్రుల మాటలు వారి జీవితాన్ని కోసమని అనుకోకుండా ఇతర విధంగా ఆలోచిస్తారు. అయితే ఇలాంటి సమయంలో వారితో ఎలా ప్రవర్తించాలి? వారిని ఎలా దారికి తీసుకురావాలి?
సాధారణంగా టీనేజ్ వయసులో ఉన్నవారు సమాజం గురించి తెలుసుకుంటూ ఉంటారు. ఇలాంటి సమయంలో వారికి కొత్త విషయాలను తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. అయితే ఈ క్రమంలో కొన్ని తప్పుడు మార్గాలు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇవి గుర్తించిన తల్లిదండ్రులు వారిపై కోపడకుండా అసలు వారు తప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆలోచించాలి. మరోసారి అలా చేయవద్దని చెప్పాలి. ఇలా ఒకటికి రెండుసార్లు చెప్పినా వినకపోతే అప్పుడు వారించాలి. అయినా వినకపోతే ఆ తప్పు వల్ల జరిగే నష్టం ఏంటో తెలపాలి.
Also Read : ఇంట్లో మొక్కలను పెంచుతున్నారా? వీటిని తప్పకుండా ఉంచండి..
కొందరు పిల్లలు చిన్నప్పటి నుంచే ఎదుటివారితో ఎక్కువగా మాట్లాడడం అలవాటు చేసుకోరు. మీరు టీనేజీ వయసు వచ్చాక కూడా అలాగే ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి సమయంలో వారికి ఏదైనా అసౌకర్యం కలిగిన లేదా సమస్యలు ఉన్నాయి ఎదుటివారితో చెప్పుకోలేక పోతారు. అంతేకాకుండా తల్లిదండ్రులతో వారు ఏ విషయాలను పంచుకోరు. దీంతో వారు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. అందువల్ల తల్లిదండ్రులు వారితో నిత్య మాట్లాడుతూ ఉండాలి. వారి సమస్యలను తెలుసుకుంటూ ఉండాలి.
కొందరు పిల్లలు చేసేది తల్లిదండ్రులు అస్సలు నచ్చరు. అయితే వారి మానసిక ఆనందానికి వారికి నచ్చినది చేయనివ్వాలి. ఉదాహరణకు చదువు విషయంలో పిల్లలకు నచ్చిన కోర్సులో జాయిన్ అయ్యే విధంగా ప్రోత్సహించాలి. తల్లిదండ్రుల లక్ష్యాలను పూర్తి చేయడానికి పిల్లలను పావుగా వాడుకోవద్దు. ఇలా చేస్తే వారు అసౌకర్యంగా ఉండి చదవలేక పోతుంటారు. చదువు విషయంలోనే కాకుండా ఇతర పనుల్లోను వారికి నచ్చిన విధంగానే ఉండాలి.
టీనేజ్ వయసులో ఉన్నవారు ఎక్కువగా కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. అయితే కొందరికి మిగతా వారి కంటే భిన్నంగా ఉండాలన్న ఆశ ఉంటుంది. ఈ క్రమంలో వారు కొన్ని తల్లిదండ్రులకు నచ్చని వాళ్ళు చేయగలుగుతారు. అయితే అవి ఉపయోగకరమైన అయితే వారికి నచ్చినది చేయనివ్వాలి. దానివల్ల ఎంత ఉపయోగమో.. అది చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయా అనే విషయాలను తెలుసుకోవాలి. ఒకవేళ ఆ పనుల వల్ల ప్రయోజనం ఉంటే వారికి స్వేచ్ఛనివ్వాలి.
కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు ఇంకా బాగుపడడం లేదని ఆందోళన చెందుతూ ఉంటారు. కానీ సమయం కాలం వచ్చినప్పుడు సమాజ పరిస్థితులను బట్టి కూడా కొందరు మారుతూ ఉంటారు. అందువల్ల తల్లిదండ్రులకు ఈ విషయంలో చాలా ఓపిక అవసరం.