Blood Sugar: మీకు బ్లడ్ షుగర్ ఉందా? మరి క్యాబేజీ తింటున్నారా?

శీతాకాలంలో ఎక్కువగా దొరుకుతుంది క్యాబేజీ. ఫ్రై, సూప్, కర్రీ ఇలా ఏదైనా సరే క్యాబేజీని ఇష్టపడేవారి సంఖ్య కూడా ఎక్కువే. కొందరు చేపలతో, రొయ్యలతో కలిసి వండుకుంటారు.

Written By: Suresh, Updated On : December 29, 2023 4:03 pm

Blood Sugar

Follow us on

Blood Sugar: ఈ మధ్య కాలంలో ఆరోగ్య సమస్యలు మరింత పెరిగాయి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. షుగర్, బీపీ వంటి సమస్యలు మరింత పెరిగాయి. ఎక్కువ మందిలో ఈ వ్యాధులు కనిపిస్తున్నాయి. అయితే షుగర్, బీపీ ఉంటే కొన్ని ఆహార పదార్థాలకు చెక్ పెట్టాల్సిందే. తినాలి అనిపించినా కూడా తినకుండా ఉండాల్సిందే. మరి చాలా మందికి క్యాబేజీ అంటే ఇష్టం. ఇంతకీ బ్లడ్ షుగర్ వ్యాధి ఉన్నవారు క్యాబేజీ తినవచ్చా లేదా అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

శీతాకాలంలో ఎక్కువగా దొరుకుతుంది క్యాబేజీ. ఫ్రై, సూప్, కర్రీ ఇలా ఏదైనా సరే క్యాబేజీని ఇష్టపడేవారి సంఖ్య కూడా ఎక్కువే. కొందరు చేపలతో, రొయ్యలతో కలిసి వండుకుంటారు. అయితే బ్లడ్ షుగర్ ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలా? లేదా తినవచ్చా అనే విషయం పోషకార నిపుణులు రీనా ఫ్రాంకో తెలిపారు. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుందట. దీని వల్ల రక్తంలో చక్కర స్థాయి పెరగదు. అంతేకాదు కొన్ని దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఉంటాయి. కాబట్టి క్యాబేజీ తినవచ్చట.

ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ కూడా ఉంటుంది. టైప్ 2 డయాబెటిస్ కు క్యాబేజీ చాలా ఉపయోగం అని తెలుస్తోంది. విటమిన్ కె, విటమిన్ సి తో పాటు వివిధ పదార్థాలు కూడా ఈ రోగులకు సహాయపడుతాయి. అజీర్ణం, అపానవాయువు, గుండెల్లో మంట, మలబద్దకం, గ్యాస్ నుంచి అల్సర్ల వంటి కడుపు సమస్యలకు కూడా మేలు చేస్తుంది క్యాబేజీ. ఇందులో ఫాస్పరస్, కాల్షియం, విటమిన్ కె వంటివి ఉంటాయి కాబట్టి ఎముకల సమస్యకైనా ముఖ్యమైనది క్యాబేజీ ఎముకల సాంద్రతను పెంచడం ద్వారా ఎముకలను బలపరుస్తుంది.

క్యాబేజీలో మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో కెరోటినాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి కళ్లకు చాలా మంచిది. కాబట్టి క్రమం తప్పకుండా తీసుకోవచ్చు. ఇక కేలరీలు తక్కువగా ఉండి.. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ బరువు తగ్గాలి అనుకుంటే క్యాబేజీ చాలా ఉపయోగపడుతుంది. అంతే కాదు మెదడుకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. నరాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చర్మం, జుట్టు అందాన్ని పెంచి మెరుపును అందిస్తుంది. అయితే దీని వల్ల దుష్ర్పభావాలు కూడా వస్తాయి.. కాబట్టి దీన్ని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి..