Assets: చాలా రోజుల తరువాత ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు ఇలా మాట్లాడుకుంటారు.. నువ్వేం చేస్తున్నాం? ఎంత సంపాదించావ్..? అయితే వీరిలో ఒకరు తమ సంపాదన గురించి చెబితే ఆయన ఏ స్టేజీలో ఉన్నాడో తెలియదు. అంటే అతడు ధనికుడా? లేదా మిడిల్ క్లాస్ కు చెందిన వాడా? లేదా పేదవాడా? అతి పేదవాడా? అని.. అయితే భారత్ లో ఆస్తులను భట్టి అతడు ఏ స్టేజీలో ఉన్నాడో తెలుసుకోవచ్చు. దీంతో ఏవైనా ప్రభుత్వ పథకాలు లేదా ఇతర అవసరాలకు ఉపయోగపడుతుంది. మరి ఎంత సంపాదిస్తే ఏ స్టేజిలో ఉంటారు? మిడిల్ క్లాస్ పీపుల్స్ అంటే ఎంత ఆదాయం ఉండాలి?
ఒక వ్యక్తి రూ.50 కోట్ల ఆస్తులు కలిగి ఉంటే అత్యధిక ధనం కలిగిన వారు అని అర్థం. అలాగే 10 కోట్ల వరకు నెట్ వర్త్ కలిగి ఉంటే ఉన్నత వర్గానికి చెందిన వారు, 5 కోట్ల ఆస్తులు కలిగి ఉంటే ధనవంతుడు అని అనుకోవాలి. ఇక రూ.2 కోట్ల ఆదాయం కలిగి ఉంటే అప్పర్ మిడిల్ క్లాస్, 1 కోటి ఆదాయాన్ని కలిగి ఉంటే మిడిల్ క్లాస్ పీపుల్స్ గా పరిగణిస్తారు. 50 లక్షల వరకు ఆస్తులు కలిగి ఉంటే లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్స్ గా పేర్కొంటారు.
10 లక్షల ఆదాయం కలిగి ఉంటే పేదవారుగా గుర్తించబడుతారు. రూ.5 లక్షల కంటే తక్కువ ఆస్తులు కలిగి ఉంటే అతి పేదరికం అని చెప్పవచ్చు. రూ.లక్షరూపాయల కంటే తక్కువ ఆదాయాన్ని కలిగి ఉంటే అతి పేదరికంలో ఉన్నవారిగా గుర్తిస్తారు. ఇలా వ్యక్తలకు వచ్చే ఆదాయాన్ని భట్టి వారి కేటగిరీని నిర్ణయిస్తారు. ఈ కేటగిరీ ప్రకారం వారికి సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పథకాలు వర్తించేలా చేస్తారు. అంతేకాకుండా వీరు ఆదాయపు పన్ను కట్టాలా? లేదా? అనేది కూడా తెలిసిపోతుంది.
ప్రస్తుత కాలంలో చాలా మంది వివిధ ఉద్యోగాలు చేస్తున్నా.. ఆదాయం పెరగడం లేదు. ఉద్యోగాలు చేసేవారు ఆదాయం సరిపోకపోవడంతో తమ ఆస్తులను కూడబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడడం లేదు. దీంతో కొందరు అదనపు ఆదాయం చేస్తున్నారు. మరికొందరు మాత్రం తమ ప్రతిభను ఉపయోగించి ఉద్యోగాలు మారుతున్నారు. అయితే పూర్ కేటగిరిలో ఉన్నట్లయితే వారు మరింత కష్టపడి ఉన్నత వర్గానికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారు.