Rats Remove Tips: ఇంట్లో ఎలుకల బెడద ఎక్కువ ఉందా? అయితే సింపుల్ గా తరిమేయండి ఇలా..

ఇంట్లో నుంచి ఎలుకల్ని బయటికి పంపాలంటే తల ప్రాణం తోకకొస్తుంటుంది కదా. దీని వల్ల చాలా మంది ఇబ్బంది కూడా పడతుంటారు. కొందరు బిస్కెట్స్ వంటివి పెడతారు అయినా నో యూజ్ కదా. మెడిసిన్స్ వాడితే పెద్దవాళ్ళ ఆరోగ్యానికి ఇబ్బంది అని వాడాలంటే కాస్త ఆలోచిస్తారు.

Written By: Swathi Chilukuri, Updated On : September 3, 2024 11:29 am

Rats Remove Tips

Follow us on

Rats Remove Tips: ఇంట్లో ఎలుకలు అటూఇటూ తిరుగుతుంటే చాలా చిరాకుగా అనిపిస్తుంటుంది కదా. ఒకటే పరుగు పరుగు పెడుతుంటాయి. కాళ్లల్లోనే తిరుగుతాయి కొన్ని సార్లు. సో కోపం వస్తుంటుంది కదా. వద్దంటే తెలియదు వాటికి. మనకేమో కోపం, చిరాకు పోదు. మరి ఈ ఎలుకల బాధ తప్పించుకోవడం ఎలా అనుకుంటున్నారా? ఎందుకంటే బట్టలను కూడా పాడు చేస్తాయి. ఇంట్లో ఉన్న వస్తువులను పాడు చేస్తుంటాయి ఎలుకలు. ఏవైనా పదార్థాలను బయట పెడితే చాలు వాటిని తింటాయి. కొరికి పెడుతుంటాయి.

ఇంట్లో నుంచి ఎలుకల్ని బయటికి పంపాలంటే తల ప్రాణం తోకకొస్తుంటుంది కదా. దీని వల్ల చాలా మంది ఇబ్బంది కూడా పడతుంటారు. కొందరు బిస్కెట్స్ వంటివి పెడతారు అయినా నో యూజ్ కదా. మెడిసిన్స్ వాడితే పెద్దవాళ్ళ ఆరోగ్యానికి ఇబ్బంది అని వాడాలంటే కాస్త ఆలోచిస్తారు. అలా కాకుండా ఈజీగా ఎలుకల్ని ఇంట్లో నుంచి ఎలా బయటికి పంపే టిప్స్ కూడా ఉన్నాయి. మరి అవేంటో ఓ సారి తెలుసుకుందాం. జిల్లేడు ఆకులు ఇంటి చుట్టుపక్కలా లభిస్తుంటాయి. వాటిని తీసుకొచ్చి ఎలుకలు తిరిగే ప్లేస్ లో పెట్టడం వల్ల ఎలకల బాధ నుంచి విముక్తి పొందవచ్చు.

జిల్లేడు వాసనను భరించలేక ఎలుకలు ఇంట్లో నుంచి పారిపోతాయి. కానీ జాగ్రత్త పాటించడం ముఖ్యం. అయితే జిల్లేడు ఆకులను తెంపేటప్పుడు మాత్రం జాగ్రత్త వహించాలి. వీటి నుంచి వచ్చే పాలు చర్మం, కళ్ళలో పడకుండా కేర్ తీసుకోవాలి. మింట్ ఆయిల్‌ వల్ల ఎలుకలను తరిమి కొట్టవచ్చు. ఇంట్లో మూలల్లో ఈ మింట్ ఆయిల్ ను చల్లాలి. దీని ఘాటు వాసనకి ఎలుకలు పారిపోతాయి. వీటితో పాటు లవంగాలు, మిరియాలని పొడిగా చేసి ఎలుకలు తిరిగే ప్రదేశాల్లో పెట్టడం వల్ల వాటినుంచి వచ్చే ఘాటు వాసనకి ఎలుకలు రావు. వీటితో పాటు ఘాటుగా ఉండే కారాన్ని ఓ గుడ్డలో మూటలా ఉంచి మూలకు పెట్టినా సరే ఎలుకలు రావు.

ఎలుకలని బయటికి పంపే మరో మార్గం కూడా ఉంది. ముందుగా ఓ కప్పు మైదా తీసుకోని.. అందులో పిప్పర్‌మెంట్ ఆయిల్, బేకింగ్ సోడా వేసి బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఈ పిండిని చిన్న చిన్న ముద్దలు చేసి ఇంట్లో ఎలుకలు వచ్చే ప్రదేశాల్లో పెట్టడం వల్ల ఎలుకలు పారిపోతాయి. నాఫ్తలీన్ ట్యాబ్లెట్స్ స్మెల్ కు కూడా ఎలుకలు ఇంట్లోకి రావు. కాబట్టి, వీటిని నేరుగా ఎలుకలు తిరిగే ప్లేస్‌లో పెట్టడం వల్ల ఫలితాలు ఉంటాయి. లేదంటే వీటిని మెత్తని పౌడర్‌లా చేసి అందులో నీరు పోసి ముద్దలా చేసి ఇంట్లోని మూలల్లో పెట్టినా సరే ప్రయోజనం ఉంటుంది. వెల్లుల్లి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. దీన్ని దంచి వేడినీటిలో వేసి ఉప్పు, డెటాల్ కలిపి ఆ నీటిని మూలలో స్ప్రే చేసుకోవచ్చు. ఇలా చేసినా సరే ఇంట్లోరి ఎలుకలు రావు. వీటితో పాటు ఉల్లిపాయల్ని రెండుగా చీల్చి పెట్టడం వల్ల ఆ ఘాటు వాసనకు ఎలుకలు పారిపోతాయి. ఇన్ని మార్గాల్లో ఏ మార్గాన్ని ఎంచుకున్నా సరే మీ ఇంట్లోకి వచ్చే ఎలుకలను ఇట్టే తరిమేయవచ్చు. ఘాటు వాసనకు ఎలుకలు అసలు పడవు. వెంటనే పారిపోతాయి. సో ట్రై చేయండి.