Weight Loss: మీ పొట్టను కరిగించే బ్రహ్మాస్త్రం ఈ వంటింట్లోనే ఉంది.. ఇలా చేయండి

పసుపులో కర్కుమిన్ అనే యాక్టివ్ కాంపౌండ్ లభిస్తుంది. ఇది బరువు తగ్గించే ప్రక్రియని వేగం చేస్తుందట. దీంతో పాటు మెటబాలిజాన్ని పెంచడంలో సహాయం చేస్తుంది. ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గిస్తుంది పసు. వీటి కారణంగా ఈజీగా బరువు తగ్గువచ్చట.

Written By: Swathi Chilukuri, Updated On : September 3, 2024 9:38 am

Weight Loss

Follow us on

Weight Loss: కూరైనా, చారైనా పులిహోరైనా సరే పసుపు లేనిదే పని నడవది కద. ఏ వంట చేసినా సరే పసుపు ఉండాల్సిందే. వంటలకి మంచి రంగునివ్వడం మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది పసుపు. పసుపులో ఉండే అద్భుత గుణాల వల్ల దీనిని ఆయుర్వేదంలో ఎప్పట్నుంచో ఉపయోగిస్తున్నారు ఆయుర్వేద నిపుణులు. దీనిని వాడడం వల్ల బరువు కూడా తగ్గుతారని అంటున్నారు. ఏంటి పసుపు వాడితే బరువు తగ్గుతారా? అనుకుంటున్నారా? అవును మరి అదెలానో తెలుసుకోండి.

పసుపులో కర్కుమిన్ అనే యాక్టివ్ కాంపౌండ్ లభిస్తుంది. ఇది బరువు తగ్గించే ప్రక్రియని వేగం చేస్తుందట. దీంతో పాటు మెటబాలిజాన్ని పెంచడంలో సహాయం చేస్తుంది. ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గిస్తుంది పసు. వీటి కారణంగా ఈజీగా బరువు తగ్గువచ్చట. మరి ఇవన్నీ జరగాలంటే పసుపుని ఏ విధంగా ఉపయోగించాలో కూడా ఓ సారి తెలుసుకోండి. పసుపు టీ అనేది మెటబాలిజాన్ని ప్రమోట్ చేయడంలో ముందు వరుసలో ఉంటుంది. ఒకటిన్నర కప్పుల నీటిలో తాజా పసుపు కొమ్ము ముక్కలు తీసుకోని అందులో వేయాలి. అందులో రెండు మూడు మిరియాలు, అల్లం, దాల్చిన చెక్క వేసి బాగా మరగించాలి. దీనిని వడగట్టి నీటిని వేరు చేయాలి. ఈ నీటిని తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా రెగ్యులర్‌గా చేస్తుంటే రిజల్ట్ మీకే కనిపిస్తుంది అంటున్నారు నిపుణులు.

పసుపు, నిమ్మను కలిపి వాడటం వల్ల కూడా బరువు తగ్గవచ్చట. ముందుగా చెప్పుకున్నట్లుగా మెటబాలిజాన్ని బూస్ట్ చేస్తాయి ఈ మిశ్రమం. దీంతో పాటు జీర్ణ సమస్యల్ని రాకుండా చేస్తుంది కూడా. యాంటీ ఆక్సిడెంట్స్‌ని పెంచుతాయట. దీంతో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు అంటున్నారు నిపుణులు. రోజూ రాత్రి పాలలో పసుపు వేసుకుని తాగడం కూడా చాలా మంచి అలవాటు. దీని వల్ల బరువు తగ్గుతారు. అంతేకాదు జీర్ణ సమస్యలు తగ్గడమే కాకుండా బ్లడ్ షుగర్ లెవల్స్ కూడా సులభంగా తగ్గుతాయి అంటున్నారు నిపుణులు. అందుకే వీటిని వీలైనంత రెగ్యులర్‌గా ఈ పాలను తీసుకోండి.

కానీ ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. పసుపుని మోతాదులోనే వాడాలి. అదే విధంగా, వాడే ముందు డాక్టర్‌ని సలహాలు తీసుకోవడం కూడా ముఖ్యం. వారి సూచన ప్రకారమే పసుపును తీసుకోవాలి. సాధారణంగా పసుపుని ఈ విధంగా 2 నెలల కంటే ఎక్కువ రోజులు తీసుకోకూడదు. అయితే కేవలం పసుపుని వల్ల మాత్రమే బరువు తగ్గరు. దీంతో పాటు వ్యాయామం, హెల్దీ లైఫ్‌స్టైల్ ఫాలో అవ్వడం కూడా చాలా ముఖ్యం..

పసుపు పాలు కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాదు చాలా విధాలుగా ఉపయోగపడతాయి. ఇప్పట్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధ పడుతున్నారు. కొన్నిసార్లు నిద్రపోవడంలో ఇబ్బంది, ఒత్తిడి వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. వీటన్నింటికీ పసుపు పాలు సహాయం చేస్తాయి. ఒక గ్లాసు వేడి పాలలో కొద్దిగా దాల్చిన చెక్క పొడిని కలుపుకుని తాగడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. ఇది బరువును తగ్గించడంలో సహాయపడుతుంది, నిద్రను కూడా హాయిగా వచ్చేలా చేస్తుంది.