Curd Rice:సాధారణంగా పడుకునే ముందు ప్రతి రోజు తప్పకుండా పెరుగన్నం తిని పడుకుంటే చాలా ఈజీగా అరుగుదల అవుతుందని చాలామంది పెరుగుతో తిని పడుకుంటారు.అయితే మరికొందరు మాత్రం పెరుగుకు చల్లబరిచే గుణం ఉంటుంది కనుక రాత్రిపూట పెరుగు తిని పడుకోవడం మంచిది కాదని చెబుతున్నారు. అయితే నిజంగానే రాత్రిపూట పెరుగు తినకూడదా ఒకవేళ తింటే ఏమవుతుంది అనే విషయానికి వస్తే…

పెరుగుకు మన శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంటుంది అందుకోసమే రాత్రిపూట పెరుగుతో భోజనం చేసి పడుకుంటే పెరుగు మ్యూకస్ ను ఏర్పరుస్తుంది తద్వారా కఫం ఏర్పడటంతో తరచూ దగ్గు జలుబు వంటి సమస్యలతో బాధ పడాల్సి ఉంటుంది. అందుకే రాత్రిపూట వీలైనంతవరకు పెరుగుతో తినకపోవడం మంచిది. ముఖ్యంగా తరచూ దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడేవారు రాత్రిపూట పెరుగుకు దూరంగా ఉండటం మంచిది.
తప్పనిసరిగా పెరుగుతో తినాలి అనుకునేవారు మనం పెరుగు అన్నం తిన్న రెండు గంటల తర్వాత నిద్ర పోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాకాకుండా వెంటనే నిద్రపోవటం వల్ల ఆహారం జీర్ణం అయ్యే సమయంలో వేడి ఉత్పత్తి అవుతుంది. అలాంటప్పుడు పెరుగు తినడం వల్ల ఆ వేడిని పెరుగు చల్లబరుస్తుంది కనుక మనం తిన్న ఆహారం నెమ్మదిగా జీర్ణం అవుతుంది.అందుకే రాత్రి పెరుగు అన్నం తిన్న తర్వాత సుమారు రెండుగంటల వ్యవధి అనంతరం నిద్రపోవడం ఎంతో ఉత్తమం లేదంటే పూర్తిగా రాత్రిపూట పెరుగు తినడం మానేయాలి.ఇక దగ్గు జలుబు వంటి సమస్యలతో బాధపడేవారు పెరుగులో కాస్త చక్కెర లేదా మిరియాలపొడి కలుపుకుని తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది.ఇలాంటి సమస్యలతో బాధపడేవారు మధ్యాహ్నం పెరుగుతో సంతృప్తిగా తినవచ్చు కానీ రాత్రి పూట పెరుగు తినకపోవడం మంచిది.