Chicken and Mutton: చికెన్, మటన్ తో కలిపి ఇవి తింటున్నారా? డేంజర్లో పడ్డట్లే?

మాంసాహారంతో చీజ్ కలుపుకోవడం వల్ల ఎంతో రుచిగా ఉంటుంది. చికెన్ కు సంబంధించిన కొన్ని వంటకాల్లో చీజ్ ను ఉపయోగిస్తారు. సాధారణంగానే చీజ్ ఎక్కువగా రుచి ఉంటుంది.

Written By: Srinivas, Updated On : December 4, 2023 3:18 pm
Follow us on

Chicken and Mutton: శరీరానికి ఎక్కువ శక్తి రావడంతో పాటు మనసు ఉల్లాసంగా ఉండడానికి రుచికరమైన ఆహార పదార్థాలను తింటుంటారు. మాంసకృతులు ఎక్కువగా టేస్టీగా ఉండడంతో వాటిపై ఎక్కువగా దృష్టి పెడుతారు. ఇంట్లో కంటే హోటళ్లలో మాంసకృతులకు సంబంధించిన వివిధ వంటకాలు ఎక్కువగా ఎక్కువగా తయారు చేస్తారు. అందువల్ల చాలా మంది అప్పుడప్పుడు హోటల్ వంటకాలు తినాలని అనుకుంటారు. ఈ క్రమంలో కొందరు కాంబినేషన్ ఆహార పదార్థాలను తింటే ఎంజాయ్ చేస్తారు. కొన్ని కాంబినేషన్ల పదార్థాలు ఎంతో రుచిని ఇస్తాయి. అయితే ఇదే సమయంలో అవి శరీరానికి కీడు చేస్తారు. ఉదాహరణకు మాంసకృతుల పదార్థాలతో స్వీట్ సాస్ తినాలని చాలా మంది భావిస్తారు. కానీ ఇలా చేయడం వల్ల అనేక అనారోగ్యాలకు గురవుతారు. ఇలా ఏయే పదార్థాలు మాంసాహారంతో తినకూడదో చూద్దాం..

మాంసాహారంతో చీజ్ కలుపుకోవడం వల్ల ఎంతో రుచిగా ఉంటుంది. చికెన్ కు సంబంధించిన కొన్ని వంటకాల్లో చీజ్ ను ఉపయోగిస్తారు. సాధారణంగానే చీజ్ ఎక్కువగా రుచి ఉంటుంది. దీనిని చికెన్ తో కలుపుకోవడం వల్ల అసిడిటీ వస్తుంది. ఆ తరువాత అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతారు.

వివిధ మాంసకృతులు కలిపి ఒకేసారి తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. కొన్ని శుభకార్యాలయల్లో వివిధ రకాల మాంసాహార పదార్థాలను ఉంచుతారు. కొందరు ఎగ్ తో పాటు మటన్, ఫిష్ కలపి తింటారు. ఇవి వేర్వేరు ప్రోటీన్లు కలిగి ఉంటాయి. ఒకేసారి కలిపి తినడం వల్ల పొట్టలో అనేక సమస్యలు ఎదురవుతాయి.

రెడ్ వైన్ తాగేటప్పుడు కాస్త కారం ఎక్కువగా ఉండేవాటిని తీసుకుంటారు. ఇందు కోసం చికెన్ లేదా మటన్ కు సంబంధించిన ఆహార పదార్థాలు తీసుకోవాలని చూస్తారు. వైన్ తాగే సమయంలో ఇవి ఎంతో టేస్టీగా అనిపిస్తాయి. కానీ ఆ తరువాత కడుపులో మంట రావడంతో అనేక ఇబ్బందులు పడుతుంటారు.

రెస్టారెంట్లలో కొందరు చికన్ లేదా మటన్ కు సంబంధించిన పదార్థాల్లో టమోటా సాస్ ను వాడుతూ ఉంటారు. టమోటా ఆమ్లత గుణం ఎక్కువగా కలిగి ఉంటుంది. వీటితో మాంసం కలిపి తినడం వల్ల అజీర్ణ సమస్యలు వస్తాయి. ఆ తరువాత భోజనం చేసే సమయంలో ఎక్కువగా కడుపు నొప్పి వస్తుంది.