Tea Side Effects: మనలో చాలా మందికి టీ తాగే అలవాటు ఉంటుంది. ఉదయం లేచింది మొదలు పడుకునే వరకు తాగుతూనే ఉంటారు. దీంతో ఆకలి మందగిస్తుంది. సరిగా భోజనం చేయరు. తిన్న ఆహారం కూడా త్వరగా జీర్ణం కాదు. ఈ నేపథ్యంలో టీలు తాగడం తగ్గిస్తేనే మంచిదని అందరికి తెలిసినా వారు పట్టించుకోవడం లేదు. ఫలితంగా పలు రోగాలకు కూడా దగ్గరవుతున్నారు. టీ, కాఫీల్లో ఎలాంటి ప్రొటీన్లు ఉండవని తెలుసు. కానీ ఆ అలవాటు మానలేకపోతున్నారు. ఆంగ్లేయులు చేసిన అలవాట్లలో ఇది ఒకటి. పనికి రాని వాటిని మనకు అంటగట్టి మన ఆరోగ్యాలపై బురద జల్లి మనకు లాభం లేకుండా చేశారు.

ఉదయం, సాయంత్రం ఓ కప్పు టీ తాగడం అందరికి అలవాటే. కానీ ఇది ఎక్కువైతే ప్రమాదమే. టీ తాగడం వల్ల ఆరోగ్యానికి హానికరమే. టీ ఎక్కువగా తాగే వారిలో ఐరన్ శాతం తగ్గుతుంది. టీ ఆకుల్లో ఉండే ఆర్గానిక్ కాంపౌండ్లు, ఐరన్ శోషించుకుపోతాయి. టీ ఆకుల్లో ఉండే కెఫిన్ వల్ల మన నరాలు ఉత్తేజితం అవుతాయి. ఒత్తిడికి కూడా టీ కారణమవుతుందని చాలా మందికి తెలియదు. టీ ఎక్కువగా తాగితే నిద్రలేమి సమస్యలు వస్తాయి. మెలటోనిన్ అనే హార్మోన్ శరీరాన్ని నిద్రకు ఉపకరిస్తుంది. కానీ టీ ఎక్కువగా తాగితే తలనొప్పి, తల తిరగడం వంటి సమస్యలు ఏర్పడతాయి.
మనం తాగే టీ కన్నా ఎంతో ప్రొటీన్లు, బలం చేకూర్చే టీలు కూడా ఉన్నాయి. ఇందులో గ్రీన్ టీ వంటివి ఉన్నాయి. మనం ప్రతి పండగలో వినియోగించే మామిడి ఆకులతో కూడా ఎన్నో లాభాలున్నాయి. రోజు మూడు మామిడి ఆకులను వేడి నీటిలో వేసుకుని టీ లాగా చేసుకుని తాగితే ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మామిడి ఆకుల్లో మనకు ఉపకరించే శక్తులు ఉన్నా మనం పనికి రాని టీ పొడి వేసుకుని తాగుతున్నాం.
టీ తాగడం వల్ల లాభాలు కూడా ఉన్నాయని కొందరు చెబుతున్నారు. ప్రతి రోజు టీ తాగితే 108 సంవత్సరాలు జీవించొచ్చని తేలింది. టీ ఆరోగ్యానికి మంచిదని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఓ కప్పు పళ్లరసం కన్నా అధికమని తేల్చారు. క్యాన్సర్ కారకాలను నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణాశయ సమస్యలు దూరం చేస్తుంది. జీవకణాలను ఉత్తేజం పరుస్తుందని పరిశోధనలో వెల్లడవుతోంది.

మామిడి ఆకుల టీ తాగితే మధుమేహం, రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది. ఈ విషయం తెలియక చాలా మంది పలు రకాల ఇంగ్లిష్ మందులు వాడుతున్నారు. అయినా డయాబెటిస్, బీపీ కంట్రోల్ లోకి రావడం లేదు. మామిడి ఆకుల్లో ఉండే ప్రొటీన్లతో మనకు దీర్ఘకాలిక ప్రయోజనాలు దాగి ఉన్నాయని చెబుతున్నారు. దీంతో మనం మామిడి ఆకులతో చేసుకునే టీ వల్ల ఈ రెండు రోగాలు అదుపులోకి రావడమే కాకుండా ఇంకా అనేక రకాల లాభాలు దాగి ఉన్నాయని తెలుసుకోవాలి.
ఇటీవల కాలంలో మధుమేహం, రక్తపోటు చాపకింద నీరులా వస్తరిస్తున్నాయి. జంట కవుల్లా ఉంటున్నాయి. ఒకటి వస్తే దాని వెంటే మరొకటి రావడం సహజమే. దీంతో వాటిని తమ చేతుల్లో ఉంచుకునే మామిడి ఆకుల టీని తాగి బీపీ, షుగర్ ను కంట్రోల్ లో ఉంచుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. మామిడి ఆకుల టీ ప్రతి రోజు ఉదయం, సాయంత్రం రెండు పూటలా తాగొచ్చు. షుగర్, బీపీని తగ్గించే దివ్య ఔషధంగా మామిడి ఆకులు నిలవడం నిజంగా మధుమేహులకు, బీపీ పేషెంట్లకు వరంగా మారనున్నాయి.