Alcohal: మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే సంగతి తెలిసిందే. యువతలో చాలామంది మద్యానికి బానిసలవుతున్నారు. కొంతమంది స్నేహితుల వల్ల, ఇతర కారణాల వల్ల మద్యానికి అలవాటు పడి ఆ తర్వాత ఆ అలవాటును వదులుకోలేక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మద్యం తాగేవాళ్లు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. మద్యం తాగడం వల్ల దీర్ఘాకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.
తక్కువ మొత్తంలో మద్యం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని కొంతమంది చెబుతారు. ఇలాంటి ప్రకటనలను నమ్మకుండా ఉంటే మంచిదని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. ఎవరైతే మద్యాన్ని ఎక్కువగా తీసుకుంటారో వాళ్లకు క్యాన్సర్ ముప్పు ఎక్కువని చెప్పవచ్చు. ఖాళీ కడుపుతో మద్యం తీసుకోకూడదు. ఒకవేళ ఖాళీ కడుపుతో మద్యం తీసుకుంటే మాత్రం త్వరగా మత్తు ఎక్కే అవకాశం ఉంటుంది.
మద్యం వల్ల కొంతమంది హ్యాంగోవర్ సమస్యలతో బాధపడే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే మద్యం అలవాటు ఉన్నవాళ్లు ఇకపై ఆ అలవాటుకు దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు. మహిళల శరీరంపై పురుషుల శరీరంతో పోలిస్తే ఆల్కహాల్ ఎక్కువగా ప్రభావం చూపుతుంది. మహిళలు ఆల్కహాల్ కు వీలైనంత దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు. ఆల్కహాల్ శరీరంలో అనేక దుష్ప్రభావాలకు కారణమవుతుంది.
ఆల్కహాల్ ను తీసుకునే వారి మెదడులో డోపమైన్ అనే మాలిక్యూల్ రిలీజవుతుంది. మద్యం వల్ల కొన్ని లాభాలు ఉన్నా ఎక్కువ మొత్తంలో నష్టాలు ఉన్నాయి. ఎక్కువ మొత్తంలో మద్యం తీసుకుంటే శరీరంలోని అవయవాలు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల వీలైనంత వరకు మద్యానికి దూరంగా ఉంటే మంచిది.