వయసు పెరిగే కొద్దీ అలసట వస్తుంది. దీంతో ఉత్సాహం తగ్గుతుంది. యవ్వనంలో ఉన్న సమయంలో చేసిన పనులు వృద్ధాప్యం సమీపిస్తున్న కొద్దీ చేయలేం. అయితే కొందరు పూర్తిగా వృద్ధాప్యం రాకముందే మనసులో ఏవేవో ఆలోచనలు పెట్టుకొని ఎలాంటి పనులు చేయడానికి ఉత్సాహం చూపించరు. దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మెదడు చురుకుగా ఉంటే శరీరం యాక్టివ్ అవుతుంది. అయితే మెదడు ఉత్సాహంగా ఉండడానికి కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అవేంటంటే?
మానవ శరీరానికి మెదడు చాలా ముఖ్యం. మెదడును ఎప్పుడు ఆరోగ్యంగా ఉండే విధంగా చూసుకోవాలి. ఇందు కోసం నిత్యం ధ్యానం చేసే అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు కనీసం గంట పాటు ధ్యానం చేయడం వల్ల మెదడుకు విశ్రాంతిని ఇచ్చినట్లు అవుతుంది. దీంతో రియాక్టివేట్ అవుతుంది. ప్రతిరోజు ఉదయం ధ్యానం చేయడం వల్ల రోజంతా యాక్టివ్ గా ఉంటారు.
మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన నిద్ర అవసరం. ప్రతి మనిషి కనీసం 6 నుంచి 7 గంటల పాటు నిద్ర పోయే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఈ సమయం నిద్రకు కేటాయించడం వల్ల మెదడు రిలాక్స్ అవుతుంది. దీంతో మనసులో ఉత్తేజం వస్తుంది. ఈ ఉత్తేజం ద్వారా ఎటువంటి భారమైన పనులు కూడా చేయగలుగుతారు.
కూరగాయలు పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. దీంతో ఎటువంటి ఒత్తిడిని ఎదుర్కోవడానికి అవకాశం ఉండదు. అలాగే శరీర రక్త ప్రసరణ సక్రమంగా ఉండే విధంగా వాకింగ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ పెరిగి ఆరోగ్యంగా ఉండగలుగుతారు.
మెదడు సక్రమంగా ఉండడానికి ఆలోచనలు కూడా కారణమవుతాయి. మనం ఎంత చక్కగా ఆలోచిస్తే మెదడు అంత చురుగ్గా పనిచేస్తుంది. దీంతో చెడు ఆలోచనలకు దూరంగా ఉండి మంచి ఆలోచనలవైపు మససును మళ్లించుకోండి దీంతో చక్కటి ఆలోచనల ద్వారా సక్రమమై జీవితం ఉంటుంది.