https://oktelugu.com/

Kalyan ram: “బాలయ్య బాలయ్య… ఇరగతీసావయ్యా అంటున్న కళ్యాణ్ రామ్…

Kalyan ram: నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగిస్తుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో… ప్రముఖ హీరో శ్రీకాంత్ విలన్ గా నటించాడు. ఈ సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే ఈ సినిమాకి అన్ని ఏరియాల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో బాలయ్య నట విశ్వరూపం చూపించారు… ముఖ్యంగా అఘోరా పాత్రకి మాత్రం ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 4, 2021 / 12:45 PM IST
    Follow us on

    Kalyan ram: నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగిస్తుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో… ప్రముఖ హీరో శ్రీకాంత్ విలన్ గా నటించాడు. ఈ సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే ఈ సినిమాకి అన్ని ఏరియాల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో బాలయ్య నట విశ్వరూపం చూపించారు… ముఖ్యంగా అఘోరా పాత్రకి మాత్రం ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా కూడా ఈ మూవీ రికార్డులు సృష్టిస్తోంది. మాస్ మూవీ అయిన కూడా ఓవర్సీస్ లో భారీ కలెక్షన్స్ ను రాబట్టడం మరో ప్రత్యేక విషయం. ఈ చిత్రం ఘన విజయం సాధించడం పట్ల అభిమానులతో పాటు ఇండస్ట్రీలో చాలా మంది బాలయ్యను పొగుడుతూ ట్వీట్లు చేస్తున్నారు.

    actor kalyan ram tweet about balakrishna akhanda movie

    Also Read: “డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ” చిత్రంతో మళ్ళీ ఓటిటీలో సందడి చేయనున్న శివాని రాజశేఖర్…

    వారిలో మహేష్ బాబు, నాని, రామ్ లాంటి హీరోలతో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తన బాబాయ్ సినిమా అదిరిపోయిందంటూ ట్వీట్ పెట్టారు. తాజాగా ఈ జాబితాలోకి కళ్యాణ్ రామ్ కూడా చేరారు. ‘బాలయ్య బాలయ్య ఇరగతీసావయ్యా’ అంటూ తన బాబాయ్ ని కళ్యాణ్ రామ్ పొగడ్తలతో ముంచెత్తారు. ‘అఖండ’ సినిమాను పూర్తిగా ఎంజాయ్ చేశానని… బాబాయ్ ని ఫుల్ ఫోర్స్ లో చూశానంటూ ఈ సినిమాతో హిట్ అందుకున్న టీమ్ మొత్తానికి కంగ్రాట్స్ చెప్పారు కళ్యాణ్ రామ్. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం కల్యాణ్ రామ్ ‘బింబిసార’ అనే సినిమాలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

    Also Read: రొమాంటిక్‌ ‘సయా’.. ఊహించిన దానికంటే బాగుంటుందట !