Vastu Tips
Vastu Tips: చీపురును లక్ష్మీ దేవితో సమానంగా కొలుస్తారు ప్రజలు. ఇక ఈ చీపురును కూడా ఎక్కడ అంటే అక్కడ పెట్టకూడదట. అంతేకాదు సరైన దిశలో మాత్రమే పెట్టాలి. లేదంటే అరిష్టం అంటారు కూడా వాస్తు నిపుణులు. ఒక్క చిన్న పొరపాటు చేసినా కూడా పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. అందుకే వాస్తు నియమాలు పక్కా పాటించాలి. ఇంతకీ చీపురు పెట్టడానికి ఉత్తమ దశ ఏంటి అనుకుంటున్నారా? ఇంట్లో ఉంచిన వస్తువులన్నింటిలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అంటారు జ్యోతిష్యులు. అదే విధంగానే చీపురు.
ఈశాన్య, అగ్ని, నృతీ, కుభేర అనే నాలుగు దిక్కులు ఉంటాయి. కానీ దక్షిణ, పడమర మధ్య చీపురు ఉంచడం మంచిది. అయితే చీపురును నిలువుగా ఉంచకూడదు. దీన్ని ఎప్పుడు అడ్డంగా ఉంచాలి. అంతేకాదు తూర్పు ముఖంగా ఉంచడం వల్ల ఎక్కువ ఫలితాలు వస్తాయి. ఇల్లు తుడుచుకోవడానికి ఉత్తమ సమయం కూడా చూడాలి అంటారు. అయితే ఇల్లు శుభ్రం చేయడానికి ఉత్తమ సమయం ఉదయం, సాయంత్రం మాత్రమే అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. ఇక ఉదయం లేవగానే పూజ చేయడం మంచిదట.
చీపురును ఉంచే దిశ..దానిని ఉపయోగించే దిశ కూడా ముఖ్యమైనదిగా పరగణించబడుతుంది. మీరు ఇంటిని శుభ్రం చేసినప్పుడు, ముందుగా పశ్చిమం, ఉత్తరం వైపు నుంచి తుడుచుకోవడం ప్రారంభించాలి. ఇలా చేస్తే లక్ష్మీ మీ ఇంట్లోనే ఉంటుంది. అంతేకాదు ఆ తల్లి అనుగ్రహం కూడా ఉంటుంది. అదే సమయంలో ఊడ్చిన తర్వాత చెత్తను డస్ట్ బిన్ లోనే వేయాలి. ప్రతిచోట చెత్త కుప్పలు వేస్తే పేదరికం కష్టాలు కలుగుతాయట.
ఇంటిని విడిచి పెట్టిన వెంటనే ఊడ్చవద్దట. తరచుగా చాలా మంది తమ ఇంటి సభ్యులు వెళ్లిన తర్వాత ఇల్లు ఊడుస్తారు. కానీ అలా చేయడం మంచిది కాదట. చీపురు కొనడానికి కూడా ఉత్తమమైన రోజును సూచిస్తారు నిపుణులు. కొత్త చీపురు కొనడానికి అన్ని రోజులు మంచి రోజులని చెబుతారు. అయితే శనివారం నాడు చీపురు కొనడం వల్ల మరింత మెరుగైన ఫలితాలు లభిస్తాయి. గురు, శుక్రవారాల్లో చీపురు కొనడం మంచిది కాదట. వైపర్ చిన్నగా ఉంటే వెంటనే భర్తీ చేయండి. చీపురు కూడా పొడవుగా ఉండాలి అంటారు నిపుణులు.