Corona Medicines: దేశంలో అంచనాలకు అందని స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తో పోల్చి చూస్తే మాత్రం ఆస్పత్రులలో చేరేవాళ్ల సంఖ్య తక్కువగానే ఉంది. ఒమిక్రాన్ వేరియంట్ ఊపిరితిత్తులపై ఎక్కువగా ప్రభావం చూపడం లేదని వైద్యనిపుణులు చెబుతున్నారు. హోమ్ ఐసోలేషన్ లోనే ప్రజలలో చాలామంది కరోనా వైరస్ నుంచి కోలుకుంటూ ఉండటం గమనార్హం.

కరోనా సోకిన వాళ్లలో చాలామంది సొంతంగా మందులను వాడుతున్నారు. అయితే ఇలా మందులను వాడటం ఆరోగ్యానికి హానికరమని గుర్తుంచుకోవాలి. జలుబు, దగ్గు లక్షణాలు కనిపించినంత మాత్రాన మోల్నుపిరవిర్, రెమ్‌డెసివిర్ మందులను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదు. వైద్యుల సలహాలు తీసుకోకుండా మందులను వాడితే అనేక ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయి.
Also Read: నకిలీ మందుల గురించి తెలుసుకోవాలంటే ఇలా స్కాన్ చేస్తే చాలు..!
గర్భిణీలకు కరోనా సోకితే వైద్యుల సలహా లేకుండా ఎలాంటి మందులను తీసుకోకూడదు. మోల్నుపిరావిర్ ను కిడ్నీ లేదా కాలేయ సమస్యలతో బాధ పడేవాళ్లు వాడకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఐసీఎంఆర్ సైతం ఈ మందును వాడకూడదని సూచనలు చేసింది. కరోనా సోకిన సమయంలో మొదట లక్షణాలపై దృష్టి పెట్టి ఔషధాలను తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చెప్పవచ్చు.
ఆక్సిజన్ స్థాయి మరీ తక్కువగా ఉన్నా శ్వాసకోశ రేటు నిమిషానికి 30 కంటే తక్కువగా ఉన్నా ఆ లక్షణాలు తీవ్రమైన లక్షణాలు అని గుర్తుంచుకోవాలి. కరోనా తీవ్రమైన లక్షణాలు ఉన్నవాళ్లు ఆస్పత్రిలో చేరాలి. కరోనా ఔషధాలను ఇష్టానుసారం వాడితే భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.
Also Read: పారాసెటమాల్ ట్యాబ్లెట్లను ఎక్కువగా వాడేవాళ్లకు షాకింగ్ న్యూస్!
[…] Heroine: అందం చందం అభినయం ఉన్నా కూడా ఎంతో మంది తెలుగు హీరోయిన్లు టాలీవుడ్ లో అగ్రస్థానానికి ఎదగలేకపోతున్నారు. అదే ఏమీ లేకున్నా కొందరు ఉత్తరాధి, దక్షిణాది హీరోయిన్లు టాప్ లోకి వెళుతున్నారు. ఎందుకిలా జరుగుతోంది? ఏంటీ కథ అన్నది సినీ వర్గాల్లోచాలా మందికి తెలుసు.. సినీ అవకాశాలు రావాలంటే అందం, అభినయం లేకున్నా ఫర్వాలేదన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఉంటే అది ఒకటి ప్లస్ లాగా పనిచేస్తుంది… లేదంటే దర్శక నిర్మాతలు, హీరోలను ‘మచ్చిక చేసుకునే’ నేర్పు అయినా ఉండాలి. చాలా మంది హీరోయిన్లు టాలీవుడ్ లోని అగ్రహీరోలను బుట్టలో పడేసి అవకాశాలు దక్కించుకుంటారన్న టాక్ ఉంది. కానీ ఒక్క హీరోయిన్ మాత్రం హీరోల కంటే కూడా నిర్మాతలను ఆకర్షిస్తోందన్న టాక్ ఇండస్ట్రీలో వినపిస్తోంది. […]
[…] AP Corona: ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. మహమ్మారి తీవ్రత పెరుగుతూనే ఉంది. పరిస్థితులు చూస్తుంటే అదుపు తప్పేలానే కనిపిస్తోంది. కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకీ కోవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. […]
[…] […]