https://oktelugu.com/

Secrets: బాధలో, సంతోషంలో ఎవరికి మీ రహస్యాలను, తప్పులు చెప్పకండి.. ఎందుకంటే?

ఏవైనా రహస్యాలు ఉంటే బాధలో ఉన్నప్పుడు, సంతోషంలో ఉన్నప్పుడు కచ్చితంగా ఎవరికి అయినా చెప్పాలి అనిపిస్తుంది. వారితో షేర్ చేసుకోవాలి అనిపిస్తుంది. కానీ ఇదే చాలా పెద్ద తప్పు. మీతో స్నేహం ఉన్నంత వరకు బాగానే ఉంటారు. కానీ కాస్త కోపం, గొడవ అయిందంటే చాలు అందరికీ మీ రహస్యాలు చెబుతుంటారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : April 21, 2024 / 02:40 PM IST

    Secrets

    Follow us on

    Secrets: రహస్యాలు, ఏదైనా విషయం ఎవరికి అయినా చెబితే ఊరు మొత్తం పాకిపోతుంది. ఎంత మందికి చెప్పాలో అంత మందికి చెబుతారు. అందుకే కొన్ని విషయాలు ఎవరికి చెప్పవద్దు అంటారు. ఒక విషయం ఎవరికి అయినా చెబితే ఊరంతా పాకే విధంగా చెసేవారు కొందరు ఉంటారు. అలాంటి వారి ముందు ఎలాంటి విషయాలను కూడా చెప్పకూడదు. లేదంటే మీ రహస్యాలు మొత్తం అందరికీ తెలిసిపోతుంటాయి. ఇంతకీ రహస్యాలు ఎవరికి అయినా చెప్పవచ్చా? లేదా అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

    ఏవైనా రహస్యాలు ఉంటే బాధలో ఉన్నప్పుడు, సంతోషంలో ఉన్నప్పుడు కచ్చితంగా ఎవరికి అయినా చెప్పాలి అనిపిస్తుంది. వారితో షేర్ చేసుకోవాలి అనిపిస్తుంది. కానీ ఇదే చాలా పెద్ద తప్పు. మీతో స్నేహం ఉన్నంత వరకు బాగానే ఉంటారు. కానీ కాస్త కోపం, గొడవ అయిందంటే చాలు అందరికీ మీ రహస్యాలు చెబుతుంటారు.

    ఏవైనా రహస్యాలు ఉన్నా లేదా ఏమైనా తప్పులు చేసినా కూడా వాటిని ఎవరికీ చెప్పకూడదు. మీకు పశ్చాత్తాపం గా అనిపిస్తే దేవుడి మందిరం లోకి వెళ్లి ఆ పరమేశ్వరుడి ముందు చేతులు జోడించండి చాలు. కానీ బాధలో, సంతోషంలో ఎవరికి మీ రహస్యాలను, మీరు చేసిన తప్పులు చెప్పకండి. దీనివల్ల తర్వాత మీరే సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

    కొన్ని రహస్యాలు మీతో మాత్రమే నశించిపోవాలి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇతరులకు చెప్పవద్దు. ఇలాంటి విషయాలు భార్య భర్తకు, భర్త భార్యకు కూడా చెప్పవద్దు. దీనివల్ల మీ మీద అనుమానం, లేదా చులకన భావం వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. చెప్పడం వల్ల జీవితాంతం మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూనే ఉంటారు. ఒక్కసారి నోటి నుంచి జారిన మాట వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఈ విషయంలో తస్మాత్ జాగ్రత్త.