Night Food: మన హిందూ సంప్రదాయాల ప్రకారం అన్నం పరబ్రహ్మస్వరూపం అని భావిస్తారు.అందుకే అన్నాన్ని సాక్షాత్తు దైవంతో సమానంగా భావిస్తారు కనుక అన్నం విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాలని పెద్దలు చెబుతుంటారు. అయితే భోజనం చేసే విషయంలో కూడా ఎన్నో నియమాలు నిబంధనలు ఉంటాయి. కానీ భోజనం చేసిన తర్వాత చాలా మంది కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక భోజనం చేసిన తర్వాత ఈ విధమైనటువంటి పొరపాట్లు చేయకూడదని పండితులు చెబుతున్నారు.

రాత్రిపూట భోజనం చేసిన తర్వాత చాలామంది గిన్నెలు కడగకుండా మరుసటి రోజు ఉదయం కడుగుతారు. ఇలా చేయడం పరమ దరిద్రం. ఇలా గిన్నెలు రాత్రిపూట అలాగే ఉంచే వారి ఇంటిలో లక్ష్మీదేవి ఎప్పటికి నిలవదు.అందుకే రాత్రి భోజనం చేసిన తర్వాత ఎలాంటి పరిస్థితులలో కూడా ఆ గిన్నెలను ఇంటిలో ఉంచకుండా వాటిని శుభ్రం చేసుకోవాలి. అదేవిధంగా అన్నం తిన్న వెంటనే చాలామంది ఆ పళ్ళెంలో నీళ్ళు పోయకుండా వెళ్లి చేతులు బయటకు కడుగుతారు.
ఈ విధంగా అన్నం తిన్న ప్లేటులో నీళ్ళు పోయకపోవడం అశుభానికి సంకేతం. అందుకే భోజనం చేసిన తర్వాత చేతిని ప్లేట్ లోనే కడిగి ఆ ప్లేట్ వెంటనే శుభ్రం చేయాలి. అలాగే భోజనం చేసే సమయంలో చాలామంది అటు ఇటు తిరుగుతూ భోజనం చేస్తుంటారు. ఇలా తిరుగుతూ భోజనం చేయకూడదని ఇలా చేయటం వల్ల సాక్షాత్తు అన్నపూర్ణాదేవిని అవమానించినట్లేనని పెద్దలు చెబుతుంటారు అందుకే ఒకే చోట కూర్చొని భోజనం చేయాలి.