Sunday Special: ఎప్పుడూ తాగితే వ్యసనం.. రోజూ తాగితే రోగం.. అప్పుడుడప్పుడు తాగితే అలవాటు. మద్యపానం హానికరం అని మద్యం బాటిళ్లపై ముద్రించి మరీ సర్కారు అమ్మడం దారుణమే. చెట్టు పేరు చెప్పి కాయలమ్మడం లాంటిదే. ప్రభుత్వం ఆదాయం కోసం మద్యం తయారు చేయడం తరువాత తాగితే జరిమానాలు విధించడం రెండూ ప్రభుత్వం చేసే పనులు కావడం విశేషం. ఇటీవల కాలంలో మద్యానికి బానిసలు కాకుండా నేటి యువత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో విధంగా ఎక్కడ పడితే అక్కడ తాగి పడిపోవడం చేయడం లేదు. ఫలితంగా కెరీర్ పైనే ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

మొదట చదువు తరువాత ఉద్యోగం. జీవితంలో స్తిరపడటానికే యువత ఆసక్తి పెంచుకుంటోంది. కెరీర్ ను తీర్చిదిద్దుకునేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. ఇందుకు గాను తమ భవిష్యత్ చేరుకునేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. దీనికి మద్యం అడ్డు తగులుతుందని పక్కన పెట్టేందుకు వెనకాడటం లేదు. ఈ నేపథ్యంలో చేతిలో సీసా ఉంటే ఇక అంతే సంగతని తెలుసుకుని దాని జోలికి వెళ్లకుండా ఉండాలని తాపత్రయపడుతోంది.
ఉత్తర అమెరికా, బ్రిటన్, నార్వే, ఫిన్ లాండ్, ఆస్టేలియా తదితర దేశాల్లోని యువతపై జరిపిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. మద్యపానం హానికరమనే విషయం అని తెలుసుకుని దాని జోలికి వెళ్లకుండా ఉండేందుకు ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. యువతలో తాగుడు వ్యసనం దూరం చేసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కలలు కంటున్నారు. అన్నింటికి తాగుడే ప్రతిబంధకం కానుందని అవగాహనకు వస్తున్నారు.
భవిష్యత్ పై భయంతోనే తాగుడుకు దగ్గరవడం లేదు. మద్యం తాగితే మనసు అదుపులో ఉండదని తెలిసిందే. దీంతోనే తాగుడును దూరం చేసుకుంటున్నారు. యువత ఎక్కువగా జీవితంలో స్థిరపడేందుకే ఆలోచిస్తున్నారు. దీంతో మద్యపానం జోలికి కూడా వెళ్లడం లేదు. యువతలో మార్పు కనిపిస్తోంది.
Also Read: సీఎం రమేష్ టీడీపీకి ఫేవరేనా?
ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెడుతున్నారు. మద్యం సేవిస్తే లివర్ పాడవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్న సందర్భంలో యువత దాన్ని ముట్టుకోవడానికి జంకుతోంది. యువత కొత్తదనం కనిపిస్తోంది. ఉద్యోగాలు సంపాదించి జీవితంలో రాణించి మంచి భార్యను చూసుకుని తన భవిష్యత్ ను తీర్చిదిద్దుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
దీంతో తల్లిదండ్రులను కూడా బాగా చూసుకోవడానికి యువత ఆసక్తి చూపుతున్నారు. కుటుంబాన్ని సరైన మార్గంలో నిలబడే విధంగా తమ బతుకును మార్చుకుంటున్నారు. దీంతో తల్లిదండ్రులను బాగా చూసుకోవాలనే అభిప్రాయంతో ఉన్నారు అందుకే తాగుడును పూర్తిగా దూరం చేసుకుంటున్నారు. అయితే మద్యపానం వల్ల కలిగే ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండేందుకు నిర్ణయించుకుంటున్నట్లు తెలుస్తోంది.
Also Read: తెలంగాణలో ‘ఒమిక్రాన్’ ఆంక్షలు.. వేడుకల్లేవ్.. ఇక ఇవి పాటించడం తప్పనిసరి