
Do not give these with Milk : పిల్లలకు ప్రధానమైన ఆహారం పాలు. ఇందులో విటమిన్లు, ప్రొటీన్లు, కాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలు ఉంటాయి. దీంతో ఇవి వారికి బలవర్ధకైన ఆహారమే. ఎముకలు, దంతాలు బలంగా ఉండటానికి ఇవి తోడ్పడతాయి. వీటిని తీసుకోవడం వల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అందుకే చాలా మంది పిల్లలకు ఉదయం పూట పాలు ఇస్తుంటారు. పాలతో పాటు ఇతర తినకూడని పదార్థాలు ఉంటాయి వాటిని తీసుకుంటే త్వరగా జీర్ణం కావు. దీంతో ఇబ్బందులు తలెత్తుతాయి. పిల్లలకు త్వరగా జీర్ణం కావాలంటే అందులో ఏమి వేయకూడదు.
పాలతో పాటు సిట్రస్ పండ్లు ఇవ్వకూడదు. నారింజ, నిమ్మ వంటి పండ్లు పాలతో పాటు తినకూడదు. ఇలా తింటే అందులో ఉండే ఆమ్లం పాలలో కలిసి ప్రొటీన్లు పెరుగుతాయి. దీంతో అవి త్వరగా జీర్ణం కావు. దీంతో ఎసిడిటి సమస్య ఏర్పడుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, తిమ్మిరి వంటి సమస్యలకు కారణమవుతుంది. ఒక గ్లాసు నారింజ లేదా సిట్రస్ పండ్ల రసం ప్రత్యామ్నాయంగా ఇవ్వొచ్చు. కానీ వాటితో కలిపి ఇస్తే మాత్రం నష్టాలు వస్తాయని తెలుసుకోవాలి.
పిల్లలకు పాలతో పాటు చిప్స్ వంటి ఉప్పుగా ఉండే స్నాక్స్ ఇవ్వొద్దు. ఇందులో ఉప్పు ఎక్కువగా ఉండటంతో జీర్ణం కావు. వీటికి బదులు గ్లాసు నీరు లేదా పండ్లు, కూరగాయలు వంటి చిరుతిళ్లు పెడితే మంచిదే. పాలతో పాటు పుచ్చకాయ తినకూడదు. ఇవి రెండు కలిపి తీసుకుంటే ఇందులో ఉండే ఆమ్లం పాలలోని ప్రొటీన్ ఎక్కువై త్వరగా అరగవు. దీంతో వారు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. రెంటిని కలిపి ఇవ్వడం వల్ల వారికి జీర్ణ సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.

పాలతో పాటు ద్రాక్ష తినకూడదు. ద్రాక్ష తిన్న తరువాత గంట అయ్యే వరకు ఏం తాగకూడదు. ద్రాక్షలో కూడా ఆమ్ల స్వభావం కలిగి ఉన్నందున సమస్యలకు కేంద్రంగా నిలుస్తుంది. పాలతో పాటు ఏం తీసుకోకుండా జాగ్రత్త పడాలి. ఒక పాలను మాత్రమే తీసుకుంటే ఎలాంటి ఆటంకాలు ఉండవు. కానీ పాలతో పాటు ఏవైనా కలిపి తీసుకున్నట్లయితే ఇతర ఉదర సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లల ఆహారం విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండకపోతే వారికి జీర్ణ సంబంధ సమస్యలు ఎదురు కావడం ఖాయం.