
Adipurush: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటిస్తున్న చిత్రాలలో ఇండియా మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఆది పురుష్’.మోషన్ కాప్చర్ టెక్నాలజీ తో రామాయణం ని తెరకెక్కించే విన్నూతన ప్రయత్నం చేసాడు డైరెక్టర్ ‘ఓం రౌత్’.గతం ఏడాది విడుదల చేసిన టీజర్ కి ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన వచ్చింది.ఫ్యాన్స్ కూడా కార్టూన్ సినిమాని చూసినట్టు ఉంది అంటూ సోషల్ మీడియా లో హోరెత్తిపోయ్యే రేంజ్ లో రచ్చ చేసారు.
దీనితో మూవీ టీం ఫ్యాన్స్ అంచనాలను అందుకోలేకపోయాము అనే విషయాన్నీ గ్రహించి ఈ చిత్రం విడుదల ని వాయిదా వేశారు.గ్రాఫిక్స్ మొత్తం రీ వర్క్ చేసారు.జులై 16 వ తేదీన విడుదల చేద్దాం అనుకున్నారు.కానీ రీ వర్క్ చేసిన తర్వాత కూడా సినిమా ఔట్పుట్ ప్రభాస్ కి నచ్చలేదట.దీనితో మరింత వర్క్ చెయ్యడం కోసం ఈ చిత్రాన్ని మరోసారి వాయిదా వెయ్యబోతున్నారట.
ఇలా వరుసగా వాయిదాలు వేసుకుంటూ పొయ్యేసరికి ప్రభాస్ ఫ్యాన్స్ లో తీవ్రమైన అసహనం మొదలైంది.ఈ సినిమాని వాళ్ళు పూర్తిగా మర్చిపోయారు కూడా,వాళ్ళ అంచనాలు మొత్తాన్ని సలార్ మూవీ కి షిఫ్ట్ చేశారు.ఆ సినిమా కోసమే ఎదురు చూస్తున్నారు.అయితే రేపు శ్రీరామ నవమి సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన సరికొత్త పోస్టర్ ని విడుదల చేయబోతున్నారట.ఈ పోస్టర్ లో సరికొత్త డేట్ కూడా ఉండబోతుందని సమాచారం.దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని వినికిడి.

ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి అయ్యింది,గ్రాఫిక్స్ కి సంబంధించిన వర్క్ కోసమే ఇన్ని రోజుల విలువైన సమయాన్ని వెచ్చిస్తున్నారట.చూడాలి మరి ఈసారైనా ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలను మూవీ టీం అందుకుంటుందా లేదా అనేది, ఈ సినిమాలో శ్రీ రాముడిగా ప్రభాస్, సీత గా కృతి సనన్ మరియు రావణుసురిడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు.