
Believe in God : మన దేశంలో జ్యోతిష్య శాస్త్రాన్ని చాలా మంది నమ్ముతారు. ప్రతి పని చేసే విషయంలో ముహూర్తం చూసుకుని మరీ మొదలుపెడతారు. జాతకం గురించి మనకు ఎన్నో అంచనాలు ఉంటాయి. ప్రతి వారు తమ జాతకంలో ఉన్న విషయాలతోనే తమ బతుకు మార్గం నడుస్తుందని అనుకుంటారు. తమ జీవితంలో ఎంత ఎత్తుకు ఎదుగుతామనే విషయం కూడా జాతకంలో ఉందో లేదో తెలుసుకుని ఆ దిశగానే ఆలోచిస్తారు. పూర్వ కాలంలో మన వారు చాంద్రమానం ప్రకారం లెక్కలు కట్టి సూర్య చంద్రుల గమనం గురించి ఎన్నో విషయాలు చెప్పారు. దీంతో జ్యోతిష్యంపై అందరికి ఏవో అంచనాలు ఉండటం సహజమే. ఈ నేపథ్యంలో జ్యోతిష్యాన్ని నమ్మేవారు ఎక్కువగానే ఉంటారు.
కొందరిలో నిరుత్సాహం
సమాజంలో కొందరు దూసుకువెళ్తుంటే మరి కొందరు మాత్రం వెనకే ఉంటారు. వీరు తమ జాతకం బాగా లేదని నిరుత్సాహ పడుతుంటారు. తమకు గ్రహాలు కలిసి రావడం లేదని బాధపడుతుంటారు. నరదృష్టి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. ఏ పని చేసినా ఫలితం రావడం లేదని చెబుతుంటారు. భగవంతుడిని నిందిస్తూ కాలం గడుపుతుంటారు. కానీ భగవంతుడి మీద భారం వేసి కష్టాల్లో ఉన్నాను కాపాడు తండ్రి అంటే మన మీద కరుణ చూపిస్తాడు. కానీ మన వారికి అంత సహనం ఉండదు. ఏదైనా క్షణాల్లో రావాలని చూస్తుంటారు.
ఎంతటి వారికైనా..
ఎంతటి వారికైనా కష్టాలు తప్పవు. ఎవరికి ఉండే కష్టాలు వారికి ఉంటాయి. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు ఎంత స్థాయిలో ఉంటే కష్టాలు కూడా అంతే స్థాయిలో ఉండటం సహజమే. కొందరు చెప్పుకుని బాధపడుతుంటారు. కొందరు మాత్రం చెప్పుకోలేక పోతారు. మన జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే కొద్ది రోజులు కష్టాలు రావడం జరుగుతుంది. అంత మాత్రాన భయపడి ఏదో అయిపోయినట్లు కాకుండా కాస్త సహనం వహించి సావధానంగా ఆలోచించి భగవంతుడిపై మనసు పెడితే కచ్చితంగా మంచి రోజులు వస్తాయి.
ఆలోచనలు పక్కదారి పట్టకుండా..
కష్టాల సమయంలో మన మనసు చెంచలం కాకుండా చూసుకోవాలి. తప్పుడు మార్గంలో పయనిస్తే మనకు కష్టాలు తప్పవని గుర్తించాలి. మంచి మార్గాన్ని ఎన్నుకోవాలి. ఆధ్యాత్మికత ప్రకారం నడుచుకుని దైవ చింతనలో గడిపితే మనకు మంచి భవిష్యత్ రావడానికి ఆస్కారం కలుగుతుంది. కష్టాల్లో ఉన్నప్పుడు విష్ణు సహస్ర నామం, శివ సహస్రనామం, గణపతి సహస్ర నామం వంటి మంత్రాలు చదువుకుని మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే దుష్ట శక్తులన్ని పోయి మంచి పరిస్థితులు వస్తాయి.

భగవంతుడి మీదే భారం
మన కష్టాలు తొలగాలని భగవంతుడి మీద భారం వేసి ఉంచాలి. స్వామి నువ్వే దిక్కు అంటే కచ్చితంగా రక్షిస్తాడు. అంతేకాని ఏవేవో పిచ్చి పనులు చేయకూడదు. మనసా వాచా కర్మణా భగవంతుడిని నమ్ముకున్న వారికి నష్టం ఉండదు. కష్టాలు దరిచేరవు. దీంతో భగవంతుడిని నమ్ముకున్న వారు చెడిపోలేదు. వారికి ఏదో ఒక సమయంలో దేవుడు అండగా నిలుస్తాడు. అందుకే భగవన్నామ స్మరణ ఒక్కటే మార్గం. మన కష్టాల కడలి దాటేందుకు సరైన మార్గం భగవంతుడే అని గట్టి నమ్మకంతో ఉంటే మనకు కష్టాలు రావని గుర్తుంచుకోవాలి.