Non Veg On Sunday: ఆదివారం అంటే అందరికి గుర్తొచ్చేది మాంసాహారమే. అందరు ఈ రోజు మద్యం తాగడం, మాంసం తినడం తెలిసిందే. కానీ ఆదివారాన్ని రవి వారం అంటారు. సూర్యుడి రోజు కావడంతో ఈ రోజుకు ప్రత్యేకత ఉన్న సంగతి తెలియదా?. కానీ ఎందుకు ఈ రోజునే మాంసాహారం తింటూ మనలోని సంప్రదాయాన్ని లెక్కలోకి తీసుకోవడం లేదు. ఫలితంగా సూర్యుడి రోజును అపవిత్రం చేస్తున్నారు. అంటే దీనిపై ఓ వాస్తవం దాగి ఉన్న విషయం చాలా మందికి తెలియదు.

మనకు స్వాతంత్ర్యం రాక ముందు మన దేశంలో గురుకులాలు ఉండేవి. దీంతో ఆదివారం రోజును ప్రత్యేకంగా పూజించేవారు. సూర్యుడికి వర్జ్యం ఇచ్చేవారు. దీంతో సంప్రదాయబద్ధంగా నడుచుకునే వారు. దీనిపై బ్రిటిష్ గవర్నమెంట్ ఓ కమిటీ వేసింది. దీంతో ఆ కమిటీ తేల్చిందేమిటంటే భారతదేశంలో ఉన్న సంప్రదాయాన్ని పోగొడితే తప్ప మనం ఇక్కడ పరిపాలించడం వీలు కాదు అని తేల్చేసింది. దీంతో ఆదివారం ప్రత్యేకంగా సెలవు దినంగా ప్రకటించి మద్యం, మాంసం అలవాటు చేసింది. అలా మన ఆచార వ్యవహారాలు మంటగలిశాయి. ఇందులో బ్రిటిష్ వాడి ప్రమేయం ఉందని తెలుసుకుంటే మంచిది.
Also Read: Bheemla Nayak Nizam Record: నైజాం ప్రాంతం లో చెక్కు చెదరని భీమ్లా నాయక్ రికార్డ్
ఇంకా ఆదివారం కటింగ్, షేవింగ్ చేసుకోకూడదు. గోళ్లు తీసుకోకూడదు. ఆయిల్ మసాజ్ కూడా చేయించుకోకూడదదు. ఇవన్నీ సూర్యుడికి ఇష్టముండని పనులు. అందుకే వీటిని ఆదివారం చేసే వారు కాదు. కానీ బ్రిటిష్ వాడి కుట్రలకు బలై మన ఆచారాలు మంటగలిసినట్లు తెలుస్తోంది. ఇంకా ఆదివారం ఆడవారితో సంభోగిచకూడదు. ఇదంతా ఆదిత్య పురాణంలో మనకు కనిపిస్తుంది.
గురుకులంలో మద్యం ముట్టేవారు కాదు. మాంసం తినేవారు. సూర్యుడికి నమస్కారం చేసిన తరువాత శాఖాహారమే భుజించేవారు. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకునేవారు. అందుకే తెలివితేటలు పుష్కలంగా ఉండేవి. ప్రపంచానికి విద్య నేర్పిన నలంద విశ్వవిద్యాలయం లాంటి సంస్థలు ఉన్న మన దేశంలో బ్రిటిష్ వాడు నింపిన విషతుల్యమైన ఆహారమే మాంసాహారం. దీంతోనే మన మనుగడ ప్రశ్నార్థకంలో పడింది. ఇప్పటికైనా మనవారు తెలుసుకుని మద్యం, మాంసానికి, మగువకు ఆదివారం దూరంగా ఉండటమే శ్రేయస్కరం.

ఆదివారం ప్రత్యేకమైన వారంగా గుర్తించి ఈ రోజు మాంసం తినకుండా మద్యం ముట్టకుండా మగువను తాకకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. రవివారం ప్రత్యేకతను పాటించి మన జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను తగ్గించుకోవాలి. అప్పుడే మనకు సార్థకత వస్తుంది. మంచి ఫలితాలు వస్తాయి. అందుకు గాను మనం సంసిద్ధులం అయి మంచి అలవాట్లను ఆచరిస్తే అందరికి మంచి జరుగుతుందని ఆశిద్దాం.
[…] Also Read: ఆదివారం మాంసం ఎందుకు తినకూడదు? […]
[…] Also Read: ఆదివారం మాంసం ఎందుకు తినకూడదు? […]