
Health Tips: మనలో చాలా మందికి ఆరోగ్య చిట్కాలు తెలియవు. దీంతో చేయకూడని పనులు చేస్తుంటారు. కొన్ని పనులు ఎప్పుడు చేయాలో? ఎప్పుడు చేయకూడదో స్పష్టంగా తెలుసుకుని మసలుకోవాలి. లేదంటే మనకు అనారోగ్యాలు దరిచేరడం ఖాయం. కానీ ఇవేమీ పట్టించుకోరు. తమకు తోచిందే చేస్తారు? తమకు నచ్చింది పాటిస్తారు? దీంతో పలు వ్యాధులకు దగ్గరవుతున్నారు. ఫలితంగా పలు సమస్యలు రావడానికి కారకులవుతున్నారు. మనం లేచింది మొదలు పడుకునే వరకు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.
తిన్నాక స్నానం చేయొద్దు
ఎప్పుడైనా స్నానం ఉదయాన్నే చేయాలి. అన్నం తిన్నాక స్నానం చేయడం మంచిది కాదు. అలా చేస్తే మన జీర్ణక్రియ మందగిస్తుంది. శరీర ఉష్ణోగ్రత తగ్గి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. తిన్న తరువాత గంటన్నర తరువాత నీళ్లు తాగాలి. తిన్న తరువాతే తాగడం వల్ల మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణం కాదు. లోపల యాసిడ్ విడుదల అవుతుంది. యాసిడ్ కు నీళ్లు తోడయితే ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.
జాగింగ్, ఈత లాంటివి వద్దు
అన్నం తిన్న వెంటనే జాగింగ్, ఈత లాంటివి కూడా కొట్టకూడదు. దీని వల్ల కూడా మనకు అనారోగ్యం కలుగుతుది. సైక్లింగ్ చేయకూడదు. తినగానే ఇలా చేయడం వల్ల వాంతులు అయ్యే ప్రమాదం ఉంటుంది. తిన్న తరువాత ఓ అరగంట పాటు వాకింగ్ చేస్తే ఇంకా ప్రయోజనం కలుగుతుంది. తినగానే పడుకుంటే మనం తిన్న పదార్థం జీర్ణం కాదు. దీంతో ఎసిడిటి సమస్య వస్తుంది. ఇలా తిన్న తరువాత కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే జీవితంలో మనకు అనారోగ్యాలే రావడానికి కారణమవుతుంది.

తిన్న తరువాత
తిన్న వెంటనే పడుకోవడం వల్ల అధిక బరువు ముప్పు ఉంటుంది. ఇంకా అనేక సమస్యలకు కేంద్రంగా మారుతాం. ఈ నేపథ్యంలో తిన్న తరువాత మనం కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. అనారోగ్య సమస్యలు బాధిస్తుంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తిన్న తరువాత వెంటనే పడుకోకుండా మెలకువతో ఉంటేనే మేలు కలుగుతుంది. అన్నం తిన్న తరువాత పై జాగ్రత్తలు తీసుకోకపోతే మనకు అనారోగ్యం రావడం ఖాయం. అందుకే తిన్న తరువాత ఆ పనులు చేయకపోవడమే మంచిది.