
Hyper Aadi: ఇప్పుడు మల్లెమాల అంటే హైపర్ ఆది… హైపర్ ఆది అంటే మల్లెమాల. ఈటీవి ఛానల్ కి బంగారు బాతుల్లా ఉన్న మూడు షోలలో హైపర్ ఆదినే ప్రత్యేక ఆకర్షణ. జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ టీఆర్పీలను ఆది తన కామెడీ పంచులతో పరుగులు పెట్టిస్తున్నారు. ఎక్స్ట్రా జబర్దస్త్ పేరుతో రెండో షో స్టార్ట్ చేయడానికి కూడా హైపర్ ఆదినే కారణం. హైపర్ ఆది-సుడిగాలి సుధీర్ టీమ్స్ రెండు షోలకు భీభత్సమైన ఆదరణ తెచ్చిపెట్టాయి. హైపర్ ఆది జబర్దస్త్ నుండి వెళ్ళిపోయాక పరిస్థితి ఎలా తయారైందో చూశాం. షో పూర్తిగా కళ కోల్పోయింది.
ప్రస్తుతం ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో మాత్రమే హైపర్ ఆది యాక్టివ్ గా ఉంటున్నాడు. మల్లెమాల ప్రోగ్రామ్ సక్సెస్ వెనుక హైపర్ ఆది ఉన్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తన టాలెంట్ నిరూపించుకోవడానికి మల్లెమాల ఇక ప్లాట్ ఫార్మ్ ఇస్తే… ఇప్పుడు ఆ సంస్థకు ఆయన దిక్కయ్యాడు. అందుకే మల్లెమాల షోల్లో హైపర్ ఆది హవా నడుస్తుంది. హైపర్ ఆది ఏదంటే అదే ఫైనల్.
ఇప్పుడు స్టార్ గా వెలిగిపోతున్న హైపర్ ఆదికి కెరీర్ బిగినింగ్ లో అనేక అవమానాలు ఎదురయ్యాయట. కమెడియన్ గా ఎదిగే వరకు మల్లెమాల వాళ్ళు, టీం లీడర్స్, సీనియర్స్ నుండి అతనికి అవమానాలు ఎదురయ్యాయట. మల్లెమాల వాళ్ళు హైపర్ ఆదికి డబ్బులు ఇచ్చేవారు కాదట. కేవలం భోజనం పెట్టి పంపేసేవారట. ఒక్కోసారి అది కూడా ఉండేది కాదట. ఏనాడైనా పేమెంట్ గురించి మాట్లాడితే.. నిన్ను అన్నపూర్ణ స్టూడియోలోకి రానివ్వడమే ఎక్కువ డబ్బులు కావాలా అనేవారట.

అలా ఎన్నో అవమానాలు, సవాళ్లు ఎదుర్కొని ఈ స్థాయికి ఎదిగాడట. ప్రస్తుతం మల్లెమాలకు హైపర్ ఆది అవసరం ఉంది కానీ, హైపర్ ఆదికి మల్లెమాల అవసరం లేదు. అతడు నటుడిగా, రచయితగా పరిశ్రమలో బిజీ అవుతున్నాడు. ధమాకా, సార్ చిత్రాలకు హైపర్ ఆది డైలాగ్స్ రాసినట్లు సమాచారం. నటుడిగా ఆయనకు విపరీతంగా అవకాశాలు వస్తున్నాయి. అలాగే రాజకీయంగా కూడా సత్తా చాటుతున్నాడు. జనసేన పార్టీలో హైపర్ ఆది కీలక నేతగా ఎదిగే సూచనలు కనిపిస్తున్నాయి. హైపర్ ఆది 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా జనసేన తరపున పోటీ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.