https://oktelugu.com/

Credit Card : మే 31లోపు ఈ క్రెడిట్ కార్డుపై రూ.3000 క్యాష్ బ్యాక్.. వెంటనే త్వరపడండి..

క్రెడిట్ కార్డులకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది దీంతో వినియోగదారులకు ఆకర్షించే ఈ ఆఫర్ ను తీసుకొచ్చామని అన్నారు. ముందు ముందు ఇంకా మరెన్నో ఆఫర్లు ఉంటాయని తెలిపారు.

Written By:
  • NARESH
  • , Updated On : May 1, 2024 / 06:28 PM IST

    Rs.3000 cashback on this credit card before May 31

    Follow us on

    Credit Card : నేటి కాలంలో చాలా మందికి క్రెడిట్ కార్డును కలిగి ఉన్నారు. ప్రతీ ఆర్థిక వ్యవహారం క్రెడిట్ కార్డుతోనే నిర్వహిస్తున్నారు. మొన్నటి వరకు క్రెడిట్ కార్డు వాడాలంటే స్వైపింగ్ మిషన్ తప్పనిసరిగా ఉండాలి. కానీ ఇప్పుడు రూపే క్రెడిట్ కార్డు ఇవ్వడం ద్వారా మొబైల్ ద్వారా యూజ్ చేస్తున్నారు. అయితే రూపే కార్డులను విస్తృతం చేయడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లను ప్రకటిస్తోంది. తాజాగా ఇంటర్నేషనల్ రూపే, జేసీబీ డెబిట్, క్రెడిట్ కార్డులపై బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఈ కార్డుల ద్వారా ట్రాన్జాక్షన్ చేస్తే రూ. 3000 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు.

    రూపే, జేసీబీ కార్డుపై డిస్కౌంట్ లభించాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి. ఈ కార్డుతో స్టోర్లలో షాపింగ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా విదేశీ ప్రయాణాలు చేసేవారు సైతం స్టోర్లలో దీనిని వాడాలి. రిటైల్ స్టోర్లలో ఈ కార్డు వాడడం వల్ల 25 శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది. ఒక కార్డు మొత్తం క్యాష్ బ్యాక్ లిమిట్ రూ.1500. కానీ ఒక్కోసారి ఇది పెరగవచ్చు. ఈ ఆఫర్ మే 1 నుంచి 31 వరకు అందుబాటులో ఉంటుంది.

    ఈ సందర్భంగా ఈ క్రెడిట్ కార్డుల ఆఫర్లపై ఎన్ పీసీఐ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ వివరాలు వెల్లడించారు. వైసవి సందర్భంగా చాలా మంది విహార యాత్రలకు వెళ్లడానికి ప్రయత్నం చేస్తారు. దీంతో ఈ కార్డుల ద్వారా ట్రాన్జాక్షన్ చేయడం వల్ల వినియోగదారులు ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు. క్రెడిట్ కార్డులకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది దీంతో వినియోగదారులకు ఆకర్షించే ఈ ఆఫర్ ను తీసుకొచ్చామని అన్నారు. ముందు ముందు ఇంకా మరెన్నో ఆఫర్లు ఉంటాయని తెలిపారు.