Digestive Problems Solution: బొప్పాయి పండు మనకు దాదాపుగా అన్ని సీజన్‌లలోనూ అందుబాటులో ఉంటుంది. పైగా బొప్పాయిలో మన శరీరానికి అవసరమైన ముఖ్య పోషకాలు ఎన్నో ఉన్నాయి. విటమిన్ ఎ, బి, సి, డిలు బొప్పాయి పండ్లలో పుష్కలంగా ఉంటాయి. దీంతోపాటు ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నిషియం, పొటాషియం వంటి పోషకాలు కూడా బొప్పాయి పండ్లలో బాగా ఉంటాయి. ఈ క్రమంలో బొప్పాయి వల్ల మనకు కలిగే పలు అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు కూడా.

ఇంతకీ బొప్పాయి వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా చర్మ సంరక్షణకు బొప్పాయి బాగా పనిచేస్తుంది. దీన్ని ముఖానికి ఫేస్‌ప్యాక్‌గా వేసి వాడుకోవచ్చు. ముఖంపై ఏర్పడిన మచ్చలకు, మొటిమలకే కాక, వివిధ చర్మ వ్యాధులకు కూడా ఉపయోగించవచ్చు. చర్మంలో ఏర్పడే మృత కణాలను పోగొడుతుంది. చర్మం మరింత ప్రకాశించేందుకు బొప్పాయి తోడ్పడుతుంది.
Also Read: మోడీ సంచలనం.. వాట్సాప్, టెలిగ్రాం, జూమ్, గూగుల్ మీట్ కు షాకిచ్చిన కేంద్రం..

వయస్సు మీద పడిన వారిలోనూ ఇది తన ప్రభావాన్ని చూపిస్తుంది. వారి సౌందర్యాన్ని పెంచుతుంది. శరీరంలోని, రక్తకణాలలోని కొవ్వును తీసివేయడంతోపాటు గుండెపోటు రానీయకుండా చూస్తుంది. శరీరంలో హాని కలిగించే టాక్సిన్లను బొప్పాయి తొలగిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థకు చక్కని ఔషధంగా పనిచేస్తుంది. రోజూ బొప్పాయిని మన ఆహారంలో భాగంగా చేసుకుంటే జీర్ణ సమస్యలు తలెత్తవు. మలబద్దకానికి బొప్పాయి మంచి మందు. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలతో బాధపడేవారు నిత్యం బొప్పాయి తింటే ఫలితం ఉంటుంది. కాబట్టి, బొప్పాయి పండు ఎక్కువసార్లు తినడం అలవాటు చేసుకోండి. అది ఎంతగానో మేలు చేస్తోంది.
Also Read: బడ్జెట్ రూపకల్పనలో కేంద్రం స్టేట్లకు షాకిస్తుందా?
[…] Kangana Ranaut: బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ సినిమా సౌత్ ఇండస్ట్రీ పై, సౌత్ హీరోల పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘దక్షిణాది ప్రజలు భారతీయ సంస్కృతిలో లోతుగా పాతుకుపోయారు. వారు తమ కుటుంబాలను ప్రేమిస్తారు. వారి సంబంధాలు సాంప్రదాయబద్ధంగా ఉంటాయి. వాళ్ల ప్రొఫెషనలిజం, ప్యాషన్ అసమానం. అలాంటి ఇండస్ట్రీలోకి బాలీవుడ్ స్టార్లను అనుమతించి తమ ఇండస్ట్రీని కలుషితం చేసుకోవద్దు’ అని కంగనా పేర్కొన్నారు. ఈ మేరకు పుష్ప, కేజిఎఫ్ పోస్టర్లు షేర్ చేసింది. […]