Astrology: ఇప్పుడు ఎవరి కాలికి, వేలికి చూసినా కూడా నల్లదారం ప్రధానంగా కనిపిస్తుంటుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు చాలా మంది ఇలానే కట్టుకుంటున్నారు. కొందరు నమ్మకంతో కట్టుకుంటే మరికొందరు ఫ్యాషన్ కోసం కట్టుకుంటున్నారు. మరి ఎవరు ఎలా కట్టుకున్న ఈ నల్లధారం వల్ల ప్రయోజనాలు చాలా ఉంటాయి అంటున్నారు పండితులు. ఇంతకీ అవేంటి? ఎందుకు కట్టుకోవాలి? ఏ కాలికి కట్టుకోవాలి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
చిన్న పిల్లలు పుట్టిన వెంటనే నల్ల దారం కడుతారు. చేతులకు జిస్టి పూసలు అంటూ నల్లదారంతోనే కడుతారు. ఇలా చిన్నప్పటి నుంచే మనకు తెలియకుండా నల్లదారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉండటంతో ప్రతి ఒక్కరు కాలికి లేదా చేతికి కట్టుకుంటున్నారు. ఇక చాలా మంది శని దోష ప్రభావం వల్ల ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారు నల్లదారం కట్టుకోవడం వల్ల దోషం నుంచి విముక్తి కలుగుతుందట.
శనివారం రోజు మాత్రమే కాలికి నల్ల దారం కట్టుకోవాలి అంటున్నారు నిపుణులు. ఇక రాహు, కేతువుల బాధలు కూడా దరిచేరవు. ఏవైనా చెడు గ్రహాలు మీ ఇంట్లో ప్రవేశించి ఇబ్బంది పెట్టాలని చూసినా ఈ నల్ల దారం వల్ల అది సాధ్యం కాదట. అంతేకాదు రాహు, కేతువుల ఆగ్రహం నుంచి కూడా బయటపడవచ్చు. ఇక కుడి కాలికి నల్లదారం కట్టుకుంటే ఆర్థిక సమస్యల నుంచి కూడా విముక్తి పొందవచ్చట.
డబ్బు సమస్యల నుంచి దూరం కావచ్చు. మిమ్మల్ని చూసి ఎవరైనా అసూయ పడుతుంటే నరదృష్టి తగులుతుంది. మీరు నల్లదారం కట్టుకుంటే ఈ నర దృష్టి కూడా తొలిగిపోతుంది. అంతేకాదు నరదిష్టి తగలకుండా ఉంటుంది. కాబట్టి మంచి కోసం అయినా, ఫ్యాషన్ కోసం అయినా సరే ఈ దారం కట్టుకోండి.