
Five Things : మన సంప్రదాయంలో కొన్ని వస్తువులను పవిత్రంగా భావిస్తాం. ఇందులో పసుపు, కుంకుమ ఉంటాయి. ఎప్పుడైనా బయటకు వెళ్లే సందర్భంలో మనం చేతిలోని వస్తువులను జారవిడుస్తుంటా. ఇది అశుభానికి సంకేతమని చెబతారు. పవిత్రంగా భావించే వస్తువులను విడిచిపెట్టరాదు. అందుకే వాటిని జాగ్రత్తగా పట్టుకుంటాం. చేతిలోని వస్తువులు జారితే పనిలో క్షీణత, వైఫల్యానికి సంకేతానికి నిదర్శనంగా చెబుతాు. చేతుల్లోనుంచి నేలపై పడితే దాన్ని మనకు నష్టంగా అభివర్ణిస్తుంటారు. దీంతో వస్తువులను ఎప్పుడు కూడా జారవిడిచే ప్రయత్నం చేయడం అంత మంచిది కాదు.
వంటగదిలో లేదా డైనింగ్ టేబుల్ పై ఉండే ఉప్పు మన చేతుల్లో నుంచి కింద పడితే శుక్రుడు, చంద్రుడు బలహీనతకు సంకేతమట. ఇలా జరిగితే దాంపత్య జీవితంలో సమస్యలు ఎదురవుతాయని నమ్ముతారు. జీవిత భాగస్వామితో తరచూ గొడవలు జరుగుతాయట. వైవాహిక జీవితం సమస్యలతో సతమతమవుతుందని అభిప్రాయం. మన చేతి నుంచి నూనె కిందపడిపోతే ఏదో పెద్ద సమస్య మన చుట్టుముట్టే ప్రమాదముంటుందట. దీంతో ఆందోళన కలుగుతుంది. అప్పులు పెరుగుతాయి. రుణబాధల్లో మునిగిపోతాం.
హారతిపల్లెం మన చేతి నుంచి జారితే మనం దేవుడి పట్ల దయ చూపడం లేదని అర్థమవుతుంది. ఉపవాసం, పూజల వల్ల మనకు లాభం కలగదు. భవిష్యత్ లో ఇంకా ఏదో పెద్ద సమస్య మన దరి చేరుతుందని అర్థం. భోజనం చేసేటప్పుడు చేతుల నుంచి ఆహారం కింద పడితే మన ఇంటికి అతిథి రాబోతున్నాడంటారు. ఇంకో విషయం కూడా ఉంది మన ఇంటిని పేదరికం తాకబోతోందని సంకేతమట. వాస్తు దోషాల వల్ల ఇలా జరుగుతుందని నమ్ముతుంటారు.
పాలు పడిపోతే కూడా అశుభమే. అవి చేతి నుంచి జారి నేలపై పడినా మరిగేటప్పుడు గిన్నె మీద నుంచి బయటకు వచ్చినా మంచిది కాదు. పాలు చంద్రునికి సంబంధించినవి కావడంతో జీవితంలో సంక్షోభం రాబోతుందని సంకేతమట. ఇలా మన జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో మన చేయకూడని పనుల గురించి వివరించారు. పొరపాటున కూడా మన చేతి నుంచి జారి పడితే మనకే అరిష్టంగా భావిస్తారు. అందుకే వస్తువులను పట్టుకునేటప్పుడు పరధ్యానంగా ఉండకుండా అప్రమత్తంగా ఉంటే జారిపోవు.