
Avocado: మన శరీరంలో చెడు కొవ్వు, మంచి కొవ్వు అని రెండు ఉంటాయి. చెడు కొవ్వును ఎల్ డీఎల్ గా మంచి కొవ్వును హెచ్ డీఎల్ గా చెబుతారు. చెడు కొవ్వు మనకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది. మంచి కొవ్వు మన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చెడు కొవ్వు పేరుకుపోతే గుండె జబ్బు ముప్పు వస్తుంది. హార్మోన్ల తయారీలో కొవ్వు ప్రధాన పాత్ర పోషిస్తుంది. కొవ్వు అందించే వాటిలో మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తులు వంటి వాటి నుంచి లభిస్తంది. చెడు కొవ్వుతో మనకు నష్టాలే ఎక్కువ. అందుకే చెడు కొవ్వు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
పోషకాల్లో..
మనకు మంచి కొవ్వు అందించే ఆహారాల్లో అవకాడో ఒకటి. ఇది అత్యంత ఖరీదైన పండు. కానీ పోషకాల్లో దీన్ని మించింది లేదు. దీని కారణంగా అవకాడోను తమ ఆహారంలో భాగంగా చేసుకుంటున్నారు. ఇది చెడు కొవ్వును కరిగిస్తుంది. ఇటీవల కాలంలో ఈ పండును ఎక్కువ మంది తింటున్నారు. దీంతో మన శరీరానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. అవకాడో మంచి పోషకాలు ఉన్న పండుగా కనిపించడంతో అందరు దీన్ని తీసుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
240 కేలరీల శక్తి
అవకాడోలో దాదాపు 240 కేలరీల శక్తి ఉంటుంది. 13 గ్రాముల కార్బోహైడ్రేడ్లు, 3 గ్రాముల ప్రొటీన్, 22 గ్రాముల కొవ్వు, 10 గ్రాముల ఫైబర్, 11 మిల్లీ గ్రాముల సోడియం ఉంటాయి. ఆరు నెలల పాటు అవకాడో తిన్న వ్యక్తులపై పరిశోధనలు నిర్వహించగా ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఇది తన్న వారిలో నడుము, పొత్తికడుపులోని కొవ్వు తగ్గడంతో పాటు రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ తగ్గినట్లు తేలింది. దీంతో అవకాడో మనిషికి ఎంతో మేలు చేసే పండుగా గుర్తిస్తున్నారు.

ఎన్నో మంచి ఫలితాలు
అవకాడో ప్రత్యేకమైన పండుగా చెబుతున్నారు. ఇందులో ఉండే ఫైబర్ తో మన శరీరానికి ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయి. బరువు తగ్గడానికి కూడా ఇది దోహదపడుతుంది. ఊబకాయంతో బాధపడే వారికి కూడా ఉపశమనం లభిస్తుంది. అవకాడోలో కరిగే కరగని ఫైబర్ ఉంటుంది. ఇందులో 25 శాతం కరిగే ఫైబర్, 75 శాతం కరగని ఫైబర్ ఉంటుందని తేల్చారు. చెడు కొవ్వను కరిగించడంలో ఇది సాయపడుతుంది. అవకాడో తరచుగా తినడం వల్ల రక్తంలో ట్రైగ్లిజరడ్ల స్థాయిను 20 శాతం వరకు, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను 22 శాతం వరకు తగ్గిస్తుంది.