Coconut Water: మన ఆహార అలవాట్లే మనకు రక్షణగా నిలుస్తాయి. దీంతో మనం తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మనం రోజు కొబ్బరినీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గడానికి ఎన్నో దారులు వెతుకుతుంటారు. బరువు తగ్గించుకునే క్రమంలో పలు రకాల ఆహార పదార్థాలు తీసుకుంటారు. కానీ కొబ్బరినీళ్లతో ఎంతో మేలు కలుగుతుంది. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. కొబ్బరినీళ్లలో డీ హైడ్రేటింగ్ పానీయం కొవ్వు తగ్గించడానికి తోడ్పడుతుంది. దీంతో కొబ్బరినీళ్లు ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది.

కొబ్బరినీళ్లలో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల కడుపు తేలికగా అనినిస్తుంది. పొటాషియం, బయో ఎంజైమ్ లు మనం తీసుకునే ఆహారం తేలికగా జీర్ణమయ్యేందుకు దోహదపడుతుంది. ఇందులో ఉండే పిండి పదార్థాలు కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. దీంతో మనం ఎక్కువగా తినే వీలుండదు. పండ్ల రసాలతో పోల్చితే కొబ్బరి నీళ్లలో షుగర్ తక్కువగా ఉండటంతో ఖనిజాలు ఎక్కువగా అందుతాయి. కొబ్బరినీళ్లలో ఉండే పోషకాలతో ఎలక్ట్రోలైట్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి. దీంతో బరువు తగ్గేందుకు సాయపడుతుంది.
కొబ్బరినీళ్లతో మనం తీసుకునే ఆహార పదార్థాలు త్వరగా జీర్ణం అవుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీర్ణక్రియ నెమ్మదిగా ఉండటం వల్ల కొబ్బరినీళ్లను ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. కొబ్బరి నీళ్లలో లారిక్ ఆమ్లం ఉండటం వల్ల అతిగా తినకుండా నిరోధిస్తుంది. కొబ్బరి నీళ్లను ఉదయం తీసుకుంటే రోజంతా ఫ్రెష్ గా ఉంటుంది. కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. కొబ్బరి నీళ్లతో మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్న మాట వైద్యులు చెబుతున్నారు.

కొబ్బరినీళ్లను ఉదయం పరగడుపున తాగితే ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు కరిగించడానికి వీలవుతుంది. రోజుకు మూడుసార్లు కొబ్బరినీళ్లు తాగడం వల్ల శరీర శక్తి పెరుగుతుంది. బరువు తగ్గడానికి సాయపడుతుంది. కొబ్బరినీళ్లు తాగడం వల్ల గుండె, మూత్రపిండాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. ఇవే కాకుండా ఎన్నో రకాల లాభాలు మనకు వస్తాయి. దీంతో కొబ్బరినీళ్లను మనం రోజు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.