Diabetic: మధుమేహాన్ని తగ్గించే 5 రకాల పువ్వులు ఇవే!

పోషకాలు లేని ఫుడ్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అయితే మధుమేహాన్ని నియంత్రించడానికి కొన్ని రకాల పువ్వులు చక్కగా పనిచేస్తాయి. మరి ఆ పువ్వులు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By: Kusuma Aggunna, Updated On : October 15, 2024 8:50 pm

diabetic

Follow us on

Diabetes: ఈ రోజుల్లో చాలామంది ఆహార అలవాట్ల వల్ల మధుమేహం బారిన పడుతున్నారు. బయట ఫాస్ట్‌ఫుడ్, పోషకాలు లేని ఆహారాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య బారిన పడుతున్నారు. మధుమేహం తగ్గించుకోవాలంటే మందుల వాడటం ఎంత ముఖ్యమో.. ఆహార విషయంలో నియమాలు పాటించడం కూడా అంతే ముఖ్యం. లేకపోతే సమస్య తీవ్రత పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో చాలామంది ఇంట్లో కంటే బయట ఎక్కువగా తింటున్నారు. వీటిలో రసాయనాలు కలపడం, ఫ్రిడ్జ్‌లో ఉంచడం వల్ల ఎక్కువగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. పోషకాలు లేని ఫుడ్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అయితే మధుమేహాన్ని నియంత్రించడానికి కొన్ని రకాల పువ్వులు చక్కగా పనిచేస్తాయి. మరి ఆ పువ్వులు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

డలియా పువ్వులు
సాధారణంగా చాలామందికి డలియా పువ్వుల గురించి తెలిసే ఉంటుంది. ఈ పువ్వుల్లో మూడు అణువులు ఉంటాయి. ఇవి ప్రీడయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాలను తగ్గిస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. వీటితో పాటు మెదడు వాపును కూడా తగ్గించడంలో ప్రధాన పాత్ర వహిస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. వీటితో పాటు చర్మ సౌందర్యానికి కూడా డలియా పువ్వులను వాడితే మేలు జరుగుతుందట.

మడగాస్కర్ పెరివింకిల్
మన చుట్టూ ఉండే కొన్ని పువ్వులు ఔషధాలతో నిండి ఉంటాయి. కాకపోతే వీటి గురించి మనకి పెద్దగా తెలియదు. అలాంటి వాటిలో మడగాస్కర్ పెరివింకిల్ ఒకటి. దీంతో మధుమేహాన్ని ఈజీగా నయం చేసుకోవచ్చు. వీటితో పాటు గొంతు ఇన్ఫెక్షన్లు, రక్తపోటు, క్యాన్సర్, చర్మ వ్యాధులను కూడా నయం చేసే శక్తి ఈ పువ్వులకు ఉంది.

అరటి పువ్వు
సాధారణంగా అరటి పువ్వును వంటల్లో వండుతారు. ఈ అరటి పువ్వు కూర చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అయితే ఈ అరటి పువ్వును తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే శరీరంలో ఉండే కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో పాటు బరువు నియంత్రణలో ఉండటం, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.

మందార పువ్వు
అందరి ఇంట్లో మందార పువ్వులు ఈజీగా దొరుకుతాయి. వీటితో పానీయం చేసుకుని తాగడం వల్ల మధుమేహం తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పోషకాలు ఇన్సులిన్‌ను నిరోధిస్తుంది. మందార పువ్వు వల్ల మధుమేహ తగ్గడమే కాకుండా జట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మందార పువ్వులు, ఆకులతో కలిపి పేస్ట్ తలకి అప్లై చేస్తే జుట్టు బలంగా తయారవుతుంది. అలాగే దీంతో ఆయిల్‌ను తయారు చేసుకుని కూడా జుట్టుకు అప్లై చేస్తే రాలిపోయే సమస్య తగ్గుతుంది.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.