Diabetes Control Tips: ప్రపంచంలో మధుమేహ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. దీనికి రాజధానిగా భారతదేశం ఉండిపోతోంది. అందులో తెలుగు రాష్ట్రాలు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో అన్నం ఎక్కువగా తినడంతో డయాబెటిస్ పెరుగుతోంది. చాపకింద నీరులా మెల్లమెల్లగా తన ఉనికి చాటుతోంది. ఫలితంగా లక్షలాది మంది వ్యాధిగ్రస్తులుా మారిపోతున్నారు. రక్తంలో చక్కెర స్థాయి పెరిగితే షుగర్ గా చెబుతారు. 20-70 ఏళ్ల వయసుల్లోనే మధుమేహం వస్తోంది. దీంతో ఇక జీవితాంతం వారు మందులతో సహవాసం చేయాల్సిందే. ఈ నేపథ్యంలో షుగర్ వ్యాధి రావడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం.

మన శరీరంలో మనం తిన్న ఆహారాన్ని అరిగించే ప్రక్రియలో భాగంగా ఇన్సులిన్ పనిచేస్తుంది. మనం తిన్న ఆహారం ఎక్కువ మోతాదులో జీర్ణం కాకుండా ఉంటే అదంతా షుగర్ గా మారుతుంది. దీంతో ఇన్సులిన్ వల్ల కాకపోవడంతో అది గ్లూకోజ్ గా ఉండిపోతోంది. అదే షుగర్ అని తెలుస్తోంది. ఇక మధుమేహాన్ని అదుపులో ఉంచుకోకపోతే ఎన్నో అనర్థాలు కలుగుతాయి. అందుకే షుగర్ పేషెంట్లు చక్కెరను అదుపులో ఉంచుకోవాలి. మందులు రెగ్యులర్ గా తీసుకోవాలి. అప్పుడే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.
Also Read: Lord Shiva: మనకు శుభం కలగాలంటే శివుడి ఎలాంటి ఫొటోలు పెట్టుకోవాలో తెలుసా?
షుగర్ ను కంట్రోల్ లో ఉంచడానికి కొన్ని ఆకుల రసాలు కూడా పనికొస్తాయి. అవేంటో చూద్దాం. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడంలో తిప్పతీగ ఆకుల రసం మంచి మందులా పనిచేస్తుంది. దీని రసం రోజు ఒక గ్లాస్ తాగితే షుగర్ అదుపులో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. తిప్పతీగ ఆకులో చక్కెరను కంట్రోల్ చేసే గుణం ఉంటుందని తెలుస్తోంది. అందుకే తిప్పతీగ రసం తాగి వ్యాధిని అదుపులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. శరీరంలో షుగర్ లెవల్స్ పెరిగితే ఎన్నో నష్టాలు వచ్చే ప్రమాదం పొంచి ఉంది.
మధుమేహాన్ని అదుపులో ఉంచే మరో ఆకు మునగాకు. మునగ చెట్టు అన్ని భాగాలు పనికొస్తాయి. మునగ ఆకులు, కాయలు, చెక్క అన్ని కూడా మందులుగా పనిచేస్తాయి. మునగ ఆకులో యాంటీ డయాబెటిక్ లక్షణాలు కలిగి ఉండటం వల్ల దీన్ని షుగర్ పేషెంట్లు తీసుకోవాలి. మునగ ఆకు పొడిని కాని రసాన్ని కాని తీసుకుంటే డయాబెటిక్ నియంత్రణలో ఉంటుందని తెలుస్తోంది. మునగ ఆకుతో టీ చేసుకుని కూడా తాగొచ్చు. ఇన్ని లాభాలున్న మునగ ఆకును వదలకుండా తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఆయుర్వేదంలో ప్రముఖ పాత్ర పోషించేది వేప. దీని అన్ని భాగాలు కూడా మందులుగా వాడతారు. షుగర్ పేషెంట్లు వేప ఆకును తినొచ్చు. దీంతో మధుమేహం కంట్రోల్ లో ఉంటుంది. వేప ఆకు కషాయం కూడా తాగొచ్చు. ఇది చక్కెరను అదుపులో ఉంచుతుంది. రోజు నిద్ర లేచిన తరువాత ఓ గుప్పెడు వేప ఆకు నమిలితే మధుమేహం బాగా నియంత్రణలోకి రావడం ఖాయం. అందుకే షుగర్ పేషెంట్లు వేప ఆకును కూడా ఔషధంగా వాడుకోవచ్చు. రసంగా తీసుకోవచ్చు. ఎలాగైనా వాడుకుని వ్యాధిని కంట్రోల్ లో ఉంచుకునే ప్రయత్నం చేయడం మంచిది.
మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడంలో మరో ముఖ్యమైన ఆకు అశ్వగంధ. 2009లో ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ మాలిక్యులర్ సైన్స్ డయాబెటిస్ తో బాధపడుతున్న ఎలుకలపై ప్రయోగం చేశారు. వాటికి అశ్వగంధ ఆకులు, రసం ఇచ్చారు. దీంతో అవి వాటిని తిని మంచి ఫలితం పొందాయి. దీంతో డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచేందుకు అశ్వగంధ కూడా ఓ మందులా పనిచేస్తుందని గుర్తించారు. అందుకే మనం అశ్వగంధ ఆకు, వేరులను ఉపయోగించి రసంగా తీసుకుని వాడితే మధుమేహం కంట్రోల్ లో ఉంచుతుందని తెలుస్తోంది.
మరో ఔషధం కలబంధ. ఇది మన అందరికి తెలిసిందే. కలబంద రసం తీసుకుంటే మంచి ప్రయోజనం కలుగుతుంది. మధుమేహం దెబ్బకు దారికొస్తుంది. ఇన్ని రకాల ఆకులు తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు దాన్ని దూరం చేసుకునే క్రమంలో వాడే ఇంగ్లిష్ మందుల కంటే వీటిని వాడి చూస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. సో షుగర్ పేషెంట్లు జాగ్రత్త. వీటిని వాడండి షుగర్ ను అదుపులోకి తెచ్చుకుని జీవితాంతం హాయిగా ఉండాలని ఆశిస్తున్నాం.
Also Read:CM Jagan: ఆ ఐదుగుర్ని అసెంబ్లీ గేటు తాకనివ్వనంటున్న సీఎం జగన్.. సాధ్యమేనా?