Homeక్రీడలుMS Dhoni: రిటైర్మెంట్ పై హింట్ ఇచ్చిన ధోని..! ఇదే చివరి ఐపీఎల్

MS Dhoni: రిటైర్మెంట్ పై హింట్ ఇచ్చిన ధోని..! ఇదే చివరి ఐపీఎల్

MS Dhoni
MS Dhoni

MS Dhoni: మహేంద్రసింగ్ ధోనికిదే చివరి ఐపీఎల్. ఈ ఐపీఎల్ తరువాత ధోని రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా..? ఇప్పటికే ధోని రిటైర్మెంట్ పై జరుగుతున్న ప్రచారం వాస్తవమేనా..? అంటే అవునన్నా సమాధానమే ధోని నుంచి వినిపిస్తోంది. తాజాగా ధోని చేసిన వ్యాఖ్యలు అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.

మహేంద్రసింగ్ ధోని.. ఈ పేరు వింటే చాలు కోట్లాదిమంది అభిమానులు ఉప్పొంగిపోతుంటారు. మహేంద్ర సింగ్ ధోనీ ఆట చూసేందుకు కోట్లాది మంది అభిమానులు నిరీక్షిస్తుంటారు. అంతటి అభిమాని గణాన్ని సొంతం చేసుకున్నాడు మహి. అటువంటి మహేంద్రసింగ్ ధోనీకి సంబంధించిన ఒక వార్త అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. అదే ఐపీఎల్ నుంచి కూడా మహేంద్రసింగ్ ధోని నిష్క్రమణ. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న ధోని ఐపీఎల్ నుంచి కూడా తప్పుకుంటాడు అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై తాజాగా ధోని ఓ హింట్ ఇచ్చాడు.

ఘన విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్..

ఈడెన్ గార్డెన్స్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ – కోల్కతా నైట్ రైడర్స్ మధ్య ఆదివారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్ 20 బంతుల్లో 35 పరుగులు, కాన్వే 40 బంతుల్లో 56 పరుగులు, అజింక్య రహానే 29 బంతుల్లో 71 పరుగులు, శివం దుబే 21 బంతుల్లో 50 పరుగులు, రవీంద్ర జడేజా ఎనిమిది బంతుల్లో 18 పరుగులు చేయడంతో 236 పరుగుల భారీ లక్ష్యాన్ని కోల్కతా జట్టు ముందు ఉంచింది చెన్నై జట్టు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టు ఘోరంగా విఫలమైంది. వెంకటేష్ అయ్యర్ 20 బంతుల్లో 20 పరుగులు, నితీష్ రానా 20 బంతుల్లో 27 పరుగులు, జాసన్ రాయ్ 26 బంతుల్లో 61 పరుగులు, రింకు సింగ్ 33 బంతుల్లో 53 పరుగులు చేశారు. మిగిలిన బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో 49 పరుగులు తేడాతో చెన్నై జట్టు విజయం సాధించింది.

MS Dhoni
MS Dhoni

ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన ధోని..

మ్యాచ్ అనంతరం మాట్లాడిన చెన్నై జట్టు కెప్టెన్ ధోని.. తన రిటైర్మెంట్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ‘ఈడెన్ గార్డెన్స్ కు వచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. వారు నాకు వీడ్కోలు ఇవ్వడానికి వచ్చారు’ అని ధోని చెప్పడంతో రిటైర్మెంట్ పై ఒక స్పష్టత వచ్చినట్లు అయింది. తాజా వ్యాఖ్యలు ధోని రిటైర్మెంట్ కు సంబంధించి ఇదే చివరి ఐపీఎల్ గా అభిమానులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ సీజన్లో చెన్నై జట్టు ఈడెన్ గార్డెన్స్ లో ఆడేందుకు అవకాశం లేదు. ఇదే చివరి మ్యాచ్. ఒకవేళ ఎలిమినేటర్ కు వెళ్లినా, ఫైనల్ కు వెళ్లినా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే మ్యాచ్ లు లేవు. దీంతో ఈ సీజన్లో చెన్నై జట్టు ఆడే చివరి మ్యాచ్ ఆదివారం నాటిదే కావడం గమనార్హం. దీనిని దృష్టిలో పెట్టుకుని ధోని తాజా వ్యాఖ్యలు చేశాడు. అంటే వచ్చే సీజన్ నుంచి ధోని ఐపిఎల్ లో ఆడడు అన్న విషయం ఈ వ్యాఖ్యలతో స్పష్టమైందని అభిమానులు పేర్కొంటున్నారు. ధోనీ లేని ఐపీఎల్ ను ఊహించుకోలేమని, ధోని రిటైర్మెంట్ బాధాకరమైన నిర్ణయం అని పలువురు అభిమానులు వాపోతున్నారు.

RELATED ARTICLES

Most Popular