https://oktelugu.com/

Dhanbad: ప్రకృతి సౌందర్యమైన ధన్‌బాద్ ప్లాన్ చేస్తున్నారా.. ఈ ప్రదేశాలు అసలు మిస్ కావద్దు!

మన దేశంలో ఎన్నో రకాల సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. అలాంటి వాటిలో జార్ఖండ్‌లోని ధన్‌బాద్ ఒకటి. ఇక్కడ ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడికి వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారా.. అయితే అక్కడ ఉండే ఈ ప్రదేశాలను అసలు మిస్ కావద్దు. మరి ఆ ప్రదేశాలాంటో చూద్దాం.

Written By: Kusuma Aggunna, Updated On : October 19, 2024 10:55 pm
dhanbad

dhanbad

Follow us on

Dhanbad: మన దేశంలో ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. వీటిని చూడటానికి అసలు జీవిత కాలం కూడా సరిపోదు. మన దేశంలో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. కొందరు అయితే దేశంలో ఉండే అన్ని ప్రదేశాలను చూడాలని అనుకుంటారు. ఏదో టైమ్ పాస్‌కి చూసే వాళ్లు కొందరు ఉంటే పని పెట్టుకుని మరి చూస్తారు. ఇలా కొత్త కొత్త ప్రదేశాలను చూడటం వల్ల మనస్సుకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే మన దేశంలో ఎన్నో రకాల సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. అలాంటి వాటిలో జార్ఖండ్‌లోని ధన్‌బాద్ ఒకటి. ఇక్కడ ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. వీటిని చూడటానికి అసలు రెండు కళ్లు కూడా సరిపోవు. ధన్‌బాద్‌ను ఏ సీజన్‌లో సందర్శించిన కూడా ఎంజాయ్ చేయవచ్చు. మీరు కూడా ధన్‌బాద్ వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారా.. అయితే అక్కడ ఉండే ఈ ప్రదేశాలను అసలు మిస్ కావద్దు. మరి ఆ ప్రదేశాలాంటో చూద్దాం.

తోప్‌చాంచి సరస్సు
ధన్‌బాద్‌లో చాలా ప్రకృతి సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. అలాంటి వాటిలో తోప్‌చాంచి సరస్సు ఒకటి. ఇక్కడి పచ్చటి వాతావరణం చూడటానికి అసలు రెండు కళ్లు సరిపోవు. ఒత్తిడితో ఉంటే ఒక్కసారి ఈ ప్లేస్‌కి వెళ్తే.. అలా రిలాక్స్ అయిపోతారు. మీరు ఒకవేళ ధన్‌బాద్ వెళ్తే అసలు ఈ ప్లేస్ మిస్ కావద్దు.

భటిండా వాటర్ ఫాల్
ధన్‌బాద్‌లో భటిండా పాల్ కూడా చాలా ఫేమస్ ప్లేస్. ఇది పిక్నిక్ స్పాట్. దీనిని చూడటానికి కుటుంబ సభ్యులు అందరూ కలిసి సంతోషంగా వెళ్లి ఎంజాయ్ చేస్తారు. ఈ జలపాతం చూడటానికి చాలా చక్కగా ఉంటుంది. దీన్ని చూస్తే మనస్సుకు ఆహ్లాదకరంగా ఉంటుంది.

మాతా కళ్యాణేశ్వరి ఆలయం
ఇక్కడ ఉండే కాళీ మాత ఆలయం చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. కాళీమాతను ఏదైనా కోరుకుంటే నెరవేరుతుందని ఇక్కడ భక్తులు నమ్ముతారు. ఇక్కడ ఉండే ప్రదేశాల్లో తప్పకుండా చూడాల్సిన ప్రదేశాల్లో ఇది ఒకటి.

హజారీ బాగ్
ధన్‌బాద్‌కి సమీపంలో ఉన్న హజారీబాగ్ దట్టమైన అడవులు మధ్య రాతి నిర్మాణాలతో సుందరమైన ఉద్యానవనం ఉంటుంది. పాలరాతితో ఉండే హజారీబాగ్‌ను పచ్చటి అడవుల మధ్య చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఎలాంటి శబ్ధం లేకుండా ఇక్కడ ఉంటే చాలా హాయిగా ఉంటుంది. ధన్‌బాద్ వెళ్తే తప్పకుండా ఈ ప్లేస్ చూడకుండా అసలు రావద్దు.

బిర్సా ముండా పార్క్
ధన్‌బాద్‌లోని అత్యంత ప్రసిద్ధ ప్రదేశాల్లో ఈ బిర్సా ముండా పార్క్ ఒకటి. మొత్తం 21 ఎకరాలలో ఉండే పార్క్‌ను చూడటానికి అసలు రెండు కళ్లు సరిపోవు. ఇంత పెద్ద పార్క్‌ను తప్పకుండా చూడాల్సిందే.

బొగ్గు గనులు
భారతదేశంలోనే అతిపెద్ద బొగ్గు గనులు ఇక్కడ ఉన్నాయి. జార్ఖండ్ ప్రధాన ఆదాయ వనరు.ఇ ఇక్కడ 112 కంటే ఎక్కువ బొగ్గు గనులు ఉన్నాయి. పెద్దగా ఉండే వీటని ఒక్కసారిగా అయిన చూడాలి.