HDFC Retirement Plan: రూ.15 లక్షలు ఐదేళ్ల తరువాత రూ.30 లక్షలయ్యాయి.. ఈ స్కీమ్ పేరేంటంటే?

మ్యూచివల్ ఫండ్ పెట్టాలనుకునేవారు కొంత రిస్క్ ను కూడా తట్టుకునే శక్తి ఉండాలి. ఎందుకంటే మార్కెట్లో ఉన్న పరిస్థితుల ఆధారంగానే వారికి వడ్డీ చెల్లిస్తారు. అదే ఫిక్స్ డ్ డిపాజిట్లకు మార్కెట్ పరిస్థితులతో సంబంధం ఉండదు.

Written By: Srinivas, Updated On : May 17, 2023 4:25 pm

HDFC Retirement Plan

Follow us on

HDFC Retirement Plan: ఉద్యోగం చేసే కొందరికి లక్షల్లో జీతం ఉంటుంది.. వ్యాపారం చేసే మరికొందరికి కోట్లల్లో లాభం ఉంటుంది.. కానీ అవసరానికి వారి జేబులో 100 రూపాయలు కూడా ఉండవు. అందుకు కారణం వారికి సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోవడమే. వారికి వచ్చే ఆదాయంలో డబ్బును ఎలా సేవింగ్ చేయాలో.. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలో అనే విషయం తెలిసి ఉండదు.. ఎంత జీతం వచ్చినా కొందరు ఉద్యోగులకు నెలకు సరిపడా ఖర్చులకు సరిపోవు. ఈనేపథ్యంలో ఇటీవల డబ్బు ఇన్వెస్ట్ మెంట్ కు అనేక మార్గాలు అందుబాటులోకి వస్తున్నాయి. చాలా మంది డబ్బులను సేవ్ చేయాలనుకునేవారు ఫిక్స్ డ్ డిపాజిట్లు చేస్తారు. ఇలా చేయడం వల్ల వార్షికంగా కొంత మొత్తమే లాభం వస్తుంది. అధిక లాభం కోసం లాంగ్ టర్మ్ లో మ్యూచ్ వల్ ఫండ్ పెట్టాలని చాలా మంది సూచిస్తున్నారు.

మ్యూచివల్ ఫండ్ పెట్టాలనుకునేవారు కొంత రిస్క్ ను కూడా తట్టుకునే శక్తి ఉండాలి. ఎందుకంటే మార్కెట్లో ఉన్న పరిస్థితుల ఆధారంగానే వారికి వడ్డీ చెల్లిస్తారు. అదే ఫిక్స్ డ్ డిపాజిట్లకు మార్కెట్ పరిస్థితులతో సంబంధం ఉండదు. అయితే మ్యూచ్ వల్ ఫండ్ లో మార్కెట్లు హైక్ అయితే మాత్రం అధిక లాభాలు వస్తాయి. ఇటీవల హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ ఓ స్కీం ను ప్రవేశపెట్టింది. ఇందులో ఐదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే రూ.30 లక్షల వరకు ఆదాయం పొందవచ్చని చెబుతున్నారు. రిటైర్మెంట్ కు దగ్గరయ్యే వారికి ఇది మంచి స్కీం అని అంటున్నారు.

హెచ్ డీఎఫ్ సీ రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్ ఈక్విటీ ప్లాన్ గా చెప్పుకుంటున్న ఈ స్కీంలో ఐదేళ్ల కింద రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేసిన వారికి ఇప్పుడు రెట్టింపు మనీ వచ్చింది. దీంతో పాటు సీనియర్ సిటీజెన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ పథకాన్ని అందిస్తోంది. అదే సీనియర్ సిటిజన్స్ స్కీం. ఇందులో కూడా అధిక వడ్డీ వస్తుంది. ప్రస్తుతానికి 8.7 వడ్డీ ఇస్తున్నారు. పదవీ విరమణ చేసిన వారికి డబ్బు వస్తే వాటిని ఇందులో పెట్టొచ్చని తెలుపుతున్నారు.

రిటైర్మెంట్ అయిన వారికి ఇవి ఉపయోగంగా ఉంటాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. చాలా మంది ఇలా వచ్చిన డబ్బుతో బ్యాంకులో జమ చేస్తారు. లేదా ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తారు.అయితే ఇలా చేయడం వల్ల ట్యాక్స్ పడే అవకావం ఉంది. అదే మ్యూచ్ వల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి ట్యాక్స్ ఉండదని అంటున్నారు. పైగా అనుకున్నట్లు మార్కెట్లు హైక్ గా మారితే లాభాలు కచ్చితంగా ఉంటాయి.