Dog Birthday: వేపకాయంత వెర్రి వేయి రకాలుంటుందంటారు. ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేకత ఉండటం చూస్తుంటాం. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అనుకుంటారు. దినసరి కూలి పనులు చేసుకునే సాధారణ వ్యక్తి ఓ కుక్కకు ప్రాధాన్యం ఇచ్చి దాని పోషణ బాధ్యతలు తీసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. దాని కోసం తన కుటుంబ సభ్యులను కాదని వేరే ఇల్లు తీసుకుని నివాసం ఉండటం విశేషం. కర్ణాటకలోని షిమోగా పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్ అనే వ్యక్తికి కుక్కలంటే ఇష్టం.

హోటల్ లో పనిచేసే అయాజ్ హోటల్ కు వచ్చిన ఓ కుక్కను చేరదీశాడు. దాని ఆలనాపాలన చూశాడు. కానీ దాన్ని దాని పిల్లలను ఎవరో తీసుకుపోవడంతో అయాజ్ మరో కుక్కను రూ.28 వేలు పెట్టి కొనుగోలు చేశాడు. దానికి టైసన్ అని పేరు పెట్టాడు. రూ. 13 వేలతో ఓ పరుపు కొన్నాడు. దాని పుట్టిన రోజు ఘనంగా చేయాలని కేక్ కట్ చేయించాడు. అంతేకాదు ఓ 150 మందికి బిర్యానీ అందజేశాడు.
Also Read: యూపీలో పరిస్థితి ఎలా ఉంది.. వారణాసి నేతలకు మోడీ కీలక సూచనలు..!
పగలంతా పనికి వెళ్లేటప్పుడు కుక్కల డే కేర్ లో వదిలేసి సాయంత్రం మళ్లీ తీసుకొస్తాడు. దీంతో దానిపై అతడికి ప్రేమ ఎక్కువైంది. సొంత వారిని వదిలేసి కుక్కతో విడిగా ఉంటున్నాడంటే దానిపై అతడికి ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు. మనుషులకే విలువ లేని నేటి కాలంలో జంతువును అంత ప్రేమగా చూసుకోవడంపై జంతు ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సామాజిక మాధ్యమాల్లో ఇది వైరల్ అవుతోంది. ఓరి నీ కుక్క ప్రేమ బంగారం కానూ అని కామెంట్లు పెడుతున్నారు. అయాజ్ తీరుపై అందరు ఫిదా అవుతున్నారు. కుక్క అతడు పెంచుకున్న ఆప్యాయత మాటల్లో చెప్పల్లేనిది. మహిమల్లో చూపలేనిది. అయాజ్ కుక్కను చేరదీసి దాని సంరక్షణ చేస్తుండటంతో అందరు అతడిని ప్రశంసిస్తున్నారు. జంతువులపై మక్కువ చూపడం మామూలు విషయం కాదు. దానికి ఎంతో సహనం ఉండాలి. అంది ఏం చేసినా భరించాలి.
అయాజ్ వ్యవహారం కర్ణాటకలో సంచలనం అవుతోంది. అతడిని చూసేందుకు చాలా మంది వస్తున్నారు. కుక్కను అపురూపంగా చూసుకుంటున్న తీరుకు పొగుడుతున్నారు. కుక్కే అని తేలిగ్గా తీసుకోకుండా దాని కోసం అతడి జీవితాన్నే త్యాగం చేస్తున్నాడు. మొత్తానికి ఆ కుక్క ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుందో అని పలువురు చర్చించుకుంటున్నారు.
Also Read: ఆటో నడుపుకోవాలని హేళన చేశారు.. చేదు అనుభవంపై కన్నీళ్లు పెట్టుకున్న బౌలర్ సిరాజ్..
[…] Kohli: క్రికెట్ కింగ్ గా అతన్ని అభిమానులు పిలుచుకుంటారు. ఇన్ని రోజులు అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ గా వెలుగొందిన అతను సడెన్ పొట్టి ఫార్మాట్‌కు, ఆ తర్వాత ఏకంగా వన్ డే క్రికెట్‌కు కెప్టెన్‌గా వైదొలిగాడు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరాశ నుంచి బయటకు రాకముందే.. టెస్టు కెప్టెన్ గా కూడా తప్పుకుంటున్నట్టు ప్రకటించి కోహ్లీ అందరినీ షాక్‌కు గురి చేశాడు. దీంతో ఇప్పడు అతను ఏ ఫార్మాట్‌కు కూడా కెప్టెన్ గా లేడు. […]
[…] Naresh: ‘అశోక్ గల్లా’ హీరోగా ఈ సంక్రాంతికి లాంచ్ అయ్యాడు. పెద్ద ఫ్యామిలీకి చెందిన వారసుడు కాబట్టి.. ‘అశోక్ గల్లా’ సినిమాను భారీగా ప్రమోట్ చేశారు. అయితే, సీనియర్ నటుడు నరేష్ సినిమా రిలీజ్ తర్వాత కూడా.. సినిమాని దారుణంగా ప్రమోట్ చేస్తున్నాడు. అంతకు మించిన దారుణంగా హీరోగా ‘అశోక్ గల్లా’ను ఇంకా గొప్పగా ప్రమోట్ చేస్తున్నాడు. అసలు అశోక్ గల్లాను నరేష్ పెద్దవాళ్ళతో ఎలా పోలుస్తూ చెబుతున్నాడో ఆయనకే తెలియడం లేదు. […]