Kohli: క్రికెట్ కింగ్ గా అతన్ని అభిమానులు పిలుచుకుంటారు. ఇన్ని రోజులు అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ గా వెలుగొందిన అతను సడెన్ పొట్టి ఫార్మాట్‌కు, ఆ తర్వాత ఏకంగా వన్ డే క్రికెట్‌కు కెప్టెన్‌గా వైదొలిగాడు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరాశ నుంచి బయటకు రాకముందే.. టెస్టు కెప్టెన్ గా కూడా తప్పుకుంటున్నట్టు ప్రకటించి కోహ్లీ అందరినీ షాక్‌కు గురి చేశాడు. దీంతో ఇప్పడు అతను ఏ ఫార్మాట్‌కు కూడా కెప్టెన్ గా లేడు.

అయితే దక్షిణ ఆఫ్రికాతో టెస్టు సిరీస్ లో కెప్టెన్ గా ఉంటాడా లేదా అనుమానాలు మొదట్లోనే వ్యక్తం అయ్యాయి. కానీ అనూహ్యంగా కోహ్లీ ఇందుకు ముందుకు వచ్చాడు. కానీ ఈ సిరీస్ లో 1-2 తేడాతో ఇండియా ఓడిపోవడంతో తన కెప్టెన్సీని వదులుకుంటున్నానని ప్రకటించాడు. అయితే అతను ఇలా ప్రకటించే కంటే ముందు బీసీసీఐకి ఈ విషయాన్ని ఫోన్‌లో తెలిపాడు.
Also Read: దినసరి కూలీ.. కుక్క కోసం అంత పనిచేశాడా?
బీసీసీఐ కీలక అధికారితో ఫోన్‌లో మాట్లాడిన కోహ్లీ.. ఈ సందర్భంగా తను తప్పుకుంటానని చెప్పాడు. అయితే దక్షిణ ఆఫ్రికాతో ఆడిన టెస్టు మ్యాచ్ కోహ్లీకి 99వ మ్యాచ్. కాబట్టి వందో మ్యాచ్‌ను బెంగుళూరు వేదికగా ఆడిన తర్వాత వదులుకోవాలని సదరు అధికారి సూచించాడంట. ఇన్ని రోజులు ఇండియన్ క్రికెట్‌కు చేసిన సేవలకు గాను.. బీసీసీఐ ఘనంగా సన్మానించాలని అనుకున్నట్టు ఆ అధికారి తెలిపాడు.
కానీ కోహ్లీ బీసీసీఐ సన్మానం అవసరం లేదని తెలిపాడంట. ఒక్క రోజుతో పెద్ద మార్పు ఏమీ రాదని, పైగా తాను ఇలాంటి రికార్డులను, సెంటిమెంట్లను పెద్దగా పట్టించుకోనంటూ తెలిపాడు. అంటే బీసీసీఐకి కోహ్లీ ఈ విధంగా షాక్ ఇచ్చాడన్నమాట. వన్ డే కెప్టెన్సీ విషయంలో బీసీసీఐ తన పట్ల వ్యవహరించిన తీరుకు నిరసనగా కోహ్లీ ఇలా చేశాడంటూ ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఏదేమైనా కోహ్లీ నిర్ణయం అందరినీ షాక్‌కు గురి చేసింది.
Also Read:యూపీలో పరిస్థితి ఎలా ఉంది.. వారణాసి నేతలకు మోడీ కీలక సూచనలు..!
[…] Megastar Chiranjeevi: మెగా కుటుంబం అంటే ఒకరికి ఒకరు బాగా సపోర్ట్ చేసుకుంటారు అనే పేరు ఉంది. సినిమా హిట్టైనా.. ఫ్లాప్ అయినా ఆ సినిమా గురించి అందరూ పాజిటివ్ గానే మాట్లాడుకుంటారు. పైగా ఆ సినిమాను దగ్గరుండి ప్రమోషన్ చేస్తారు. అలాంటిది మెగా ఇంటిల్లుడి సినిమాని అస్సలు పట్టించుకోలేదు. కారణం.. కళ్యాణ్ దేవ్ ను, మెగా డాటర్ శ్రీజ దూరం పెట్టింది అని వార్తలు వినిపిస్తున్నాయి. కళ్యాణ్ దేవ్ – శ్రీజ మధ్య అస్సలు పొసగడం లేదంటూ పుకార్లు వైరల్ అవుతున్నాయి. […]