Croatia vs Morocco 2022: సాకర్ ఫీవర్ చివరి దశకు చేరుకుంది. ఫిఫా నిబంధనల ప్రకారం టోర్నీలో పోడియం ఎక్కే మూడో జట్టు ఏదో నేడు తేలనుంది. ఫిఫా ప్రపంచకప్ లో వరుస విజయాలతో సెమీ ఫైనల్లోకి దూసుకొచ్చి ఆపై ఫ్రాన్స్ చేతిలో ఓడిపోయిన మొరాకో… వర్గీకరణ మ్యాచ్ కు సిద్ధమైంది.. మూడో స్థానం కోసం శనివారం క్రొయేషియా తో తల పడునుంది..క్రొయేషియా ను ఓడించి పోడియం ఎక్కితే మొరాకోకు పెద్ద ఘనతే అవుతుంది. కానీ దాన్ని ఎలా సాధిస్తుంది అనేది ఆ జట్టు ఆటగాళ్ల ఆట తీరుపై ఆధారపడి ఉంది.” ఈ టోర్నీలో ఐరోపా ఖండంలోని అన్ని జట్లపై గెలిచాం. ఏ మ్యాచ్ లోనూ ప్రత్యర్థి జట్టుకు గోల్ చేసే అవకాశం ఇవ్వలేదు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు మేము దేనికోసం వచ్చామో” ఫ్రాన్స్ తో సెమీఫైనల్ మ్యాచ్ కు ముందు మొరాకో ఆటగాళ్లు చేసిన వ్యాఖ్యలు ఇవి. కానీ మ్యాచ్ లో వారు ఆ స్థాయి ప్రదర్శన చేయలేదు. లీగ్, క్వార్టర్స్ పోటీల్లో అనితర సాధ్యమైన డిఫెన్స్ ఆట తీరు ప్రదర్శించిన మొరాకో ఈ మ్యాచ్ లో తేలిపోవడం నిజంగా బాధాకరం. ప్రత్యర్థి జట్లకు గోల్ చేసే అవకాశాన్ని ఇవ్వని మొరాకో సెమీ ఫైనల్ మ్యాచ్ లో పూర్తిగా తడబడింది. ముఖ్యంగా ఆట ప్రారంభమైన ఐదో నిమిషానికే ఫ్రాన్స్ జట్టుకు గోల్ చేసే అవకాశాన్ని ఇవ్వడం మొరాకో చేసిన అతి పెద్ద తప్పు. ఇక్కడ మొరాకో డిఫెన్స్ బలహీనంగా మారడంతో ఫ్రాన్స్ పదేపదే దాడి చేసింది.

అదే పెద్ద తప్పు
ఫ్రాన్స్ తో సెమిస్ లో ఫినిషింగ్ చేయకపోవడం మొరాకో ను ముంచింది.. క్రొయేషియాతో ఈ విషయంలో మెరుగుపడాల్సి ఉంటుంది.. డిఫెన్స్ విభాగం పూర్తిగా లయ తప్పుతోంది. బంతిని ఎక్కువసేపు నియంత్రించినప్పటికీ గోల్ చేసే అవకాశాలు సృష్టించుకోలేకపోవడం ఆ జట్టు పెద్ద లోపం. ఆ తప్పులు సరిదిద్దుకుంటే మూడో స్థానంలో నిలవడం ఈ ఆఫ్రికా జట్టుకు పెద్ద కష్టం కాకపోవచ్చు..” మేము చాలా కష్టపడ్డాం. కానీ సెమీ ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయాం. అయినప్పటికీ మా ఆటగాళ్లు మంచి ప్రదర్శన చూపారు. ప్రస్తుతం మా లక్ష్యం కాంస్య పతకం” అని మొరాకో కోచ్ వ్యాఖ్యానించాడు..
క్రొయేషియా తక్కువేం కాదు
క్వార్టర్ ఫైనల్ లో బ్రెజిల్ జట్టుకు షాక్ ఇచ్చిన క్రొయేషియా.. ఆ జట్టు కెప్టెన్ నెయ్ మార్ కలలను నిలువునా కూల్చేసింది. క్రొయేషియా జట్టులో లూకా మోడ్రిచ్ కీలక ఆటగాడు. ఇప్పటివరకు టోర్నీలో అతడు గోల్స్ చేయకపోయినప్పటికీ.. జట్టును తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాడు. ముఖ్యంగా బంతిపై నియంత్రణ సాధించడంలో అతడు కొత్తదారులు చూపిస్తున్నాడు..కొవా సిచ్, బ్రోజోవిచ్ తో మిడ్ ఫీల్డ్ పటిష్టంగా ఉంది. అయితే అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్ లో క్రోయేషియా పప్పులు ఉడకలేదు.. బంతిని పూర్తి నియంత్రణలో ఉంచుకున్న ఈ జట్టుపై అర్జెంటీనా జట్టు పదేపదే దాడి చేసింది.. సెమి ఫైనల్లో గెలిచి దర్జాగా ఫైనల్ లోకి అడుగు పెట్టింది.

ఎవరు దూసుకెళ్తారు
ఇరుజట్ల బలాబలాలు పరిశీలించినప్పుడు సమవుజ్జీలుగా కనిపిస్తున్నాయి.. అయితే ఈ రెండు జట్లు కూడా సెమీఫైనల్స్ మ్యాచ్లో ప్రత్యర్థులకు ఏకపక్ష విజయాలు ఇచ్చాయి. గ్రూప్,క్వార్టర్ పోటీల్లో వీర విహారం చేసిన ఈ జట్లు…సెమీస్ లో తేలిపోవడం నిజంగా ఆశ్చర్యకరమే.. ఇక గ్రూప్ దశలో ఈ రెండు జట్లు తలపడగా అది డ్రా అయింది. కెరియర్లో చివరి మ్యాచ్ ఆడబోతున్న లుకా మోద్రీచ్ క్రోయేషియాకు ఎలాగైనా కాంస్య పతకం అందివ్వాలనే పట్టుదలతో ఉన్నాడు.