Brazil vs Croatia 2022: బ్రెజిల్.. ఈ పేరు వింటే ఫుట్ బాల్ ప్రేమికులకు ఎక్కడా లేని ఉత్సాహం వస్తుంది.. ఈ జట్టు క్రీడాకారులు ఫుట్ బాల్ ను తమ నరనరానా జీర్ణించుకొని ఆడతారు… కాబట్టి ప్రపంచ దేశాలు బ్రెజిల్ ను ఇష్టపడతాయి. ఆ దేశ క్రీడాకారులను అభిమానిస్తాయి. 2002లో ఫుట్ బాల్ గెలుచుకున్న ఆ జట్టు.. ఇంతవరకు మళ్లీ సాకర్ కప్ ను ఒడిసి పట్టలేదు. కానీ ఈసారి ఖతార్ వేదికగా జరిగే సాకర్ కప్ లో 2002 నాటి ఫలితం నమోదు చేస్తుందని అందరూ అనుకున్నారు.. కానీ ఈసారి క్రొయేషియా అడ్డం తగిలింది.. 2018 నాటి మ్యాజిక్ ను మళ్లీ పునరావృతం చేసింది. బ్రెజిల్ అభిమానులను శోకసంద్రంలో ముంచింది.

-గెలుస్తుంది అనుకున్నారు
ఈసారి బ్రెజిల్ చక్కటి ప్రదర్శన చేసి ప్రపంచకప్ గెలుస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తూ క్వార్టర్స్ కూడా దాట లేకపోయింది. శుక్రవారం హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన ఆ జట్టుకు క్రొయేషియా ఫెనాల్టీ షూట్ అవుట్ లో 4_2 తో షాక్ ఇచ్చింది. మ్యాచ్ నిర్ణీత సమయంలో గోల్ ఇరు జట్లూ గోల్ సాధించలేకపోయాయి.. అదనపు సమయంలో చెరో గోల్ సాధించాయి. బంతి పై ఇరు జట్లూ సమాన నియంత్రణ సాధించాయి..మ్యాచ్ లో గోల్స్ లక్ష్యంగా ఆడింది మాత్రం బ్రెజిలే. నెయ్ మార్ సహా బ్రెజిల్ ఆటగాళ్ళు పలుమార్లు బంతిని నెట్ లోకి పంపేందుకు గట్టి ప్రయత్నమే చేశారు. అయితే క్రొయేషియా డిఫెన్స్ చాలా బలంగా నిలబడగలిగింది. ఆ జట్టు గోల్ కీపర్ లివకోవిచ్ నిర్ణీత సమయంలోనే కాక.. ఫెనాల్టీ షూట్ అవుట్ లో అదర గొట్టి మ్యాచ్ హీరోగా నిలిచాడు. .. క్రొయేషియా ఆటగాడు వ్లాసిచ్ గోల్ కొట్టి క్రొయేషియా ను ఆధిక్యంలో నిలిపాడు. రోడ్రిగో విఫలం కావడం బ్రెజిల్ ను నిరాశలో ముంచింది. రోడ్రిగో నెట్ లోకి కొట్టిన షాట్ ను సరిగ్గా అంచనా వేసిన లివకోవిచ్ అద్భుతంగా డైవ్ చేసి అడ్డుకున్నాడు.
-మెరుపు షాట్లు కొట్టినప్పటికీ..
అంతకుముందు ఎలాగైనా విజయం సాధించాలని బ్రెజిల్ జట్టు బరిలోకి దిగింది. విజయమో, వీర స్వర్గమో అన్నట్టుగా క్రొయేషియా మైదానంలోకి అడుగు పెట్టింది. మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే బ్రెజిల్ ఏ లక్ష్యంతో ఆడుతున్నదో క్రొయేషియాకు అర్థమైంది. ఇరు జట్లు దాడుల మీద దాడులు చేసుకున్నారు. షాట్ల మీద షాట్లు కొట్టారు. ప్రథమార్థం ముగిసింది.. కానీ ఫలితం మాత్రం తేలలేదు.. ఇంజూరీ టైమ్ కూడా ముగిసింది. గోడలా నిలబడ్డ క్రొయేషియా డిఫెన్స్ బ్రెజిల్ ను ఖాతా తెరవనియ్యలేదు. కానీ అదనపు సమయం మొదలైన కాసేపటికే బ్రెజిల్ ఎన్నో ఆశలు పెట్టుకున్న నెయ్ మార్ కళ్ళు చెదిరే గోల్ కొట్టాడు. దెబ్బకు మైదానం ఊగిపోయింది. అభిమానుల కేరింతలకు అడ్డే లేకుండా పోయింది. గోల్ కొట్టామన్నా ఉత్సాహమో, ఇంకేమిటో తెలియదు గానీ..బ్రెజిల్ డిఫెన్స్ లో కొంత నిర్లక్ష్యం వహించింది. దీంతో గోల్ కొట్టి క్రోయేషియా స్కోరు సమం చేసింది. దీంతో షూట్ అవుట్ కు దారితీసింది. అనంతరం షూట్ ఔట్ లో షాకుల మీద షాకులు. ఒక షాట్ ప్రత్యర్థి గోల్ కీపర్ ఆపేశాడు. ఇంకొకటి గోల్ కీపర్ బార్ కు తాకింది. క్రోయేషియా మాత్రం 4 గోల్స్ కొట్టింది. పాపం ఇంకేముంది ప్రపంచ కప్ నుంచి హాట్ ఫేవరెట్ ఔట్! ఆటగాళ్ల కన్నీళ్ళతో స్టేడియం తడిసిపోయింది.

-అప్పుడే అంతా జరిగిపోయింది
నిర్ణిత సమయం, ఇంజురీ టైంలో రెండు జట్లూ గోల్స్ సాధించలేదు. దీంతో మ్యాచ్ అదనపు సమయానికి వెళ్ళింది. కాసేపటికే నెయ్ మార్ బ్రెజిల్ జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. మ్యాచ్ 106వ నిమిషంలో క్రొయేషియా బాక్స్ చివర్లో బంతిని చేజిక్కించుకున్న నెయ్ మార్.. చుట్టూ చాలామంది క్రొయేషియా డిపెండర్లు ఉన్నప్పటికీ వారిని తప్పిస్తూ బంతిని ముందుకు తీసుకెళ్లాడు.. నెయ్ మార్ నుంచి బంతిని అందుకున్న పక్వెటా తిరిగి అతడికే పాస్ ఇచ్చాడు..నెట్ కు సమీపంలోకి దూసుకెళ్లి అతడు మెరుపు గోల్ సాధించాడు. అయితే ఈ ఆనందం ఎంతోసేపు ఉండలేదు. 115వ నిమిషంలో క్రొయేషియా ఆటగాడు పెట్కోవిచ్ స్కోర్ సమం చేశాడు. అతడు కొట్టిన షాట్ రీ బౌండ్ అయి తిరిగి వచ్చింది. తిరిగి దాన్ని ఓర్చిచ్ అతడి వైపు నెట్టాడు. ఈసారి పెట్కోవిచ్ ఎటువంటి తప్పు చేయకుండా గోల్ చేశాడు. దీంతో క్రొయేషియా 4_2 ఆధిక్యంలోకి వెళ్ళింది. బ్రెజిల్ క్రీడాకారులను కన్నీటి సంద్రం లో ముంచింది. ఈసారి ఎలాగైనా కప్ సాధించాలనే లక్ష్యంతో ఉన్న సాంబా జట్టు కలలను కల్లలు చేసింది.