Homeక్రీడలుShikhar Dhawan: టీంలో చోటు లేక పాపం శిఖర్ ధావన్‌కు ఎంత దుస్థితి వచ్చే.. ఆఖరుకు...

Shikhar Dhawan: టీంలో చోటు లేక పాపం శిఖర్ ధావన్‌కు ఎంత దుస్థితి వచ్చే.. ఆఖరుకు ఇలా..!

Shikhar Dhawan
Shikhar Dhawan

Shikhar Dhawan: టీమిండియా స్టార్​ క్రికెటర్, స్టార్‌ పోపెనర్‌ శిఖర్​ధావన్​క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతం ఒకో‍్క స్థానం కోసం ముగ్గురు నలుగురు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో శిఖర్‌ జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే వరల్డ్‌ కప్‌ వరకు అవకాశం దక్కుతుందన్న ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలో ఖాళీగా ఉండడం ఎందుకని తనకు ఇష్టమైన యాక్టింగ్‌పై దృష్టిపెట్టారు. ఆయన ఊ కొట్టడమే ఆలస్యం అన్నట్లు హిందీ సీరియల్‌ నిర్మాతలు, డైరెక్టర్లు ఆయన డేట్స్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన పోలీస్​ డ్రెస్​వేసుకుని దర్శనమిచ్చాడు. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

స్టార్‌ ఓపెనర్‌గా..
టీమిండియా స్టార్ ప్లేయర్స్​విరాట్​కోహ్లీ, రోహిత్​శర్మతోపాటు పోటా పోటీగా మైదానంలో విజృంభించాడు శిఖర్​ధావన్. ఒంటి చేత్తో జట్టుకు ఎనో‍్న విజయాలు అందించాడు. ప్రస్తుతం క్రికెట్‌కు దూరమయ్యాడు. ఐదు నెలల క్రితం టీమ్ ఇండియా ఆడిన వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన ధావన్, ఇప్పుడు మూడు ఫార్మాట్లలోనూ తన చోటును కోల్పోయాడు. టీంకు దూరమైనప్పటికీ ఐపీఎల్ 2023 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే అటు క్రికెట్‌తోపాటు సినిమాల్లోనూ మెరిసే ఈ స్టార్ ప్లేయర్​ఇప్పుడు ఓ హిందీ సీరియల్‌లో నటిస్తూ బిజీబిజీగా ఉంటున్నాడు.

నాడు సినిమాలో.. నేడు సీరియల్‌లో..
ప్రముఖ హిందీ చానెల్‌లో ప్రసరామవుతున్న కుండలి భాగ్య అనే సీరియల్‌లో శిఖర్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. పోలీస్ డ్రెస్సులో ఉన్న ధావన్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్​ చేస్తున్నాయి. అయితే మొదట్లో ఈ ఫొటోలు చూసిన అభిమానులు.. ఇది ఐపీఎల్​ ప్రోమో కోసమని భావించారు. అయితే ఆయన సీరియల్‌లో నటిస్తున్నాడని తెలిసిన అభిమానులు ఒక్కసారిగా షాక్‌ గురయ్యారు. అప్పట్లోనే ధావన్‌ ఓ బాలీవుడ్​ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడు. సోనాక్షి సిన్హా, హ్యూమా ఖురేషీ ప్రధాన పాత్రల్లో నటించిన ‘డబుల్‌ ఎక్స్‌ఎల్‌’ అనే సినిమాలో ధావన్‌ అతిథి పాత్రలో కనిపించాడు.

Shikhar Dhawan
Shikhar Dhawan

గిల్‌ రాకతో శిఖర్‌కు నో చాన్స్‌..
టీమిండియా జట్టులోకి యంగ్ బ్యాటర్ శుభమన్​గిల్ రావడంతోపాటు అద్భుత ప్రదర్శన కారణంగా శిఖర్ ధావన్‌కు వన్డేల్లో చోటు లభించలేదు. అయితే టెస్టు ఆరంగేట్ర మ్యాచ్‌లోనే 187 పరుగులు చేసి రికార్డు క్రియేట్ చేసిన శిఖర్ ధావన్.. తన క్రికెట్ కెరీర్‌లో ఇలాంటి ఎన్నో రికార్డులను సృష్టించాడు. 2022లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆడిన ధావన్.. ఆ తర్వాత టీమ్‌లో తన చోటును కోల్పోయాడు. నిలకడగా రాణిస్తున్న శుభ్‌మన్​గిల్‌ను అతని స్థానంలో నిలబెట్టింది బీసీసీఐ. శిఖర్​ ధావన్​ఇక టీమ్​ ఇండియా తరుపున 34 టెస్టులు ఆడిన ధావన్, 40.61 సగటుతో 2315 పరుగులు స్కోర్​చేశాడు. అందులో 7 శతకాలు, 5 అర్ధ శతకాలు ఉన్నాయి. అంతే కాకుండా 167 వన్డేలు ఆడిన శిఖర్.. 44.11 సగటుతో 6793 పరుగులు సాధించాడు. అందులో 17 సెంచరీలు, 39 అర్థ సెంచరీలు ఉన్నాయి. కీలకమైన మ్యాచుల్లో అదిరిపోయే ఇన్నింగ్స్‌ ఆడిన ధావన్​ ‘మిస్టర్ ఐసీసీ టోర్నమెంట్స్’గా పేరొందాడు. 37 ఏళ్ల స్టార్ ప్లేయర్‌ను వయసు, స్ట్రైయిక్ రేట్​ దృష్ట్యా ఒక్కో ఫార్మాట్‌కు దూరం చేసిన బీసీసీఐ, 2022 తర్వాత ఏకంగా జట్టులోనే చోటు లేకుండా చేసింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version