Nadendla Manohar : పండగలు వస్తున్నాయి… వెళ్తున్నాయి… పేదలకు ఇళ్ళు ఏవి జగన్

Nadendla Manohar : అదిగో పండగ… ఇదిగో సొంతిల్లు అంటూ వైసీపీ పాలకులు ప్రతి పండగకీ ప్రజలను మోసం చేస్తూనే వచ్చారని.. సంక్రాంతికి ఇళ్లు ఇస్తాం మన్నారని.. ఆ ముహూర్తం వెళ్ళిపోయిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు. ఫిబ్రవరికి సిద్ధం అని ఊరించి ఉగాది అన్నారని.. తెలుగు వారి కొత్త సంవత్సరాది అయిన ఉగాది వచ్చింది. ఇప్పటికీ పేదలకు సొంతింటి కల తీరలేదంటూ విమర్శించారు. ఉగాదికి రాష్ట్రంలో 5 లక్షల కుటుంబాల సొంతింటి కల నెరవేర్చి, […]

Written By: NARESH, Updated On : March 21, 2023 5:49 pm
Follow us on

Nadendla Manohar : అదిగో పండగ… ఇదిగో సొంతిల్లు అంటూ వైసీపీ పాలకులు ప్రతి పండగకీ ప్రజలను మోసం చేస్తూనే వచ్చారని.. సంక్రాంతికి ఇళ్లు ఇస్తాం మన్నారని.. ఆ ముహూర్తం వెళ్ళిపోయిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు. ఫిబ్రవరికి సిద్ధం అని ఊరించి ఉగాది అన్నారని.. తెలుగు వారి కొత్త సంవత్సరాది అయిన ఉగాది వచ్చింది. ఇప్పటికీ పేదలకు సొంతింటి కల తీరలేదంటూ విమర్శించారు.

ఉగాదికి రాష్ట్రంలో 5 లక్షల కుటుంబాల సొంతింటి కల నెరవేర్చి, గృహ ప్రవేశాలు చేయిస్తామని వైసీపీ పాలకులు చెప్పిన మాట ఏమైందంటూ నాదెండ్ల మనోహర్ నిలదీశారు.. ఉగాది వచ్చేసినా రాష్ట్రంలో గృహ ప్రవేశాల జాడే లేదని విమర్శించారు. 17 వేల జగనన్న కాలనీల్లో 28 లక్షల ఇళ్లను కట్టబోతున్నామంటూ పేదల కళ్లకు గంతలు కట్టారని విమర్శించారు. చివరికి రాష్ట్రవ్యాప్తంగా 21 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నామని లెక్క తేల్చారన్నారు. జూన్, 2022 నాటికే 18 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని మాటలు చెప్పారని.. 2023 నాటికి మరో 10 లక్షల ఇళ్లను పూర్తి చేస్తామని ప్రభుత్వ పెద్దలు హామీలు గుప్పించారని విమర్శించారు.

అయితే ఇప్పటి వరకు వైసీపీ పాలకులు కేవలం 4.4 లక్షల ఇళ్లను మాత్రమే పూర్తి చేశారని నాదెండ్ల విమర్శించారు. 2022లో దసరా, దీపావళి, క్రిస్మస్.. ఇలా ముహూర్తాలు మార్చినా ఇళ్ల తాళాలు మాత్రం లబ్ధిదారులకు అందలేదు. గృహ ప్రవేశాలు సంక్రాంతి అని మాట మార్చినా.. ఇప్పుడు ఉగాది వచ్చినా ఇళ్ల నిర్మాణంలో మాత్రం ముందడుగుపడలేదన్నారు.

ఇంటి స్థలాల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందని జనసేన మొదటి నుంచి చెబుతోందని నాదెండ్ల అన్నారు. కొండలు, గుట్టల్లో స్థలాలు కొని, వైసీపీ నాయకులు భారీ ధరకు ప్రభుత్వం నుంచి పరిహారం పొందారు. ప్రజా ధనాన్ని జేబులో వేసుకున్నారు. దీని కోసం మాత్రమే జగనన్న ఇళ్లు కార్యక్రమం ఉపయోగపడింది తప్పితే… పేదలకు ఏ మాత్రం ప్రయోజనం కలిగించలేకపోయింది. పేదల ఇళ్ల కోసం రూ.42,973 కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేశామని ప్రభుత్వం చెబుతోంది. ఆ ఖర్చుల మీద శ్వేత పత్రం విడుదల చేయాలని నాదెండ్ల డిమాండ్ చేశారు.